Thursday 30 September 2021

జనసేన.. పావలా గాడు అంటూ శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్.. ఉరేసుకుంటావో, చస్తావో నీ ఇష్టం! అటాక్

అనే పేరు వింటేనే అంతెత్తున లేచే శ్రీ రెడ్డి.. మరోసారి సంచలన వ్యాఖ్యలతో దుమారం రేపింది. వైసీపీ కార్యకర్త, సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నడుమ మాటల తూటాలు పేలుతున్న ఈ సమయంలో సంచలన తార రంగంలోకి దిగింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు కాస్త బ్రేక్ ఇచ్చి దూరంగా ఉంటున్న ఆమె.. తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసి నెట్టింట వీరంగం సృష్టించింది. ఈ వీడియోలో శ్రీ రెడ్డి మాట్లాడుతూ.. ''ఈ పావలా గాడికి ఏం ప్యాకేజ్ అందిందో తెలియదు గానీ.. ప్రతిసారి ఎనకాల జనసేన గుర్తు వేసుకొని ఓ సభ లాంటిది పెట్టి.. ఒక నలుగురు ఆడ పిల్లలను ముందు సీట్లలో కుర్చోబెట్టుకొని, పది మంది ఈలలు వేసే బ్యాచులను డబ్బులిచ్చి పిలిపించుకొని... నీ వెనకాల తెలంగాణాలో ఓ యూనివర్సిటీలో నువ్వు ఎవ్వరిని పోషిస్తున్నావో, ఏ అల్లరి మూకని, చిల్లర మూకని నువ్వు పోగుచేసి బ్లాక్ మెయిల్ చేయడానికి మెయిన్‌టైన్ చేస్తున్నావో ఆ గ్రూపులను వాళ్ళ పేర్లతో సహా నేను బయటపెడతా. నువ్వు చిల్లర మూకలతో ఎలా అయితే దాడులు చేపిస్తున్నావో అవి మేము చేయించలేమా? అలాంటివి మేము చేయించాలంటే పెద్ద విషయమా? కోడి కత్తులంటావు కాసేపు.. వేల కోట్లంటావు కాసేపు.. వీటన్నింటికీ ప్రెస్ మీట్ పెట్టి మరీ సమాధానం చెబుతా. ఆ ప్రెస్ మీట్ చూసుకొని ఉరేసుకుంటావో, చస్తావో.. ఏం చేసుకుంటావో చేసుకో'' అని చెప్పింది. దీంతో శ్రీ రెడ్డి పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. పవన్ ఫ్యాన్స్, వైసీపీ కార్యకర్తలు రంగంలోకి దిగి కామెంట్ల రూపంలో వాదోపవాదాలు చేసుకుంటున్నారు. మరోవైపు పోసాని కృష్ణ మురళి ఇంటిపై గత అర్ధ రాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తుల దాడి సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. అయితే ఈ దాడి చేసింది పవన్ అభిమానులే అని, ఇలాంటి దాడులకు భయపడేది లేదని పేర్కొంటూ పోసాని స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. పవన్‌పై కూడా ఇలాంటి దాడులు చేయించడం పెద్ద విషయం కాదంటూ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zPDzm4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...