Sunday, 22 August 2021

Vijay Devarakonda : వర్కవుట్లు మానేసి కొంటె చేష్టలు!.. విజయ్ దేవరకొండతో రష్మిక రచ్చ

సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు కలిసి వరుసగా హిట్లు ఇవ్వడం, హిట్ పెయిర్‌గా టాక్ వస్తే వారికి ఉండే డిమాండ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇక ఆ ఇద్దరి మధ్యే ఏదో నడుస్తోందనే రూమర్లు కూడా వస్తుంటాయి. అలా రష్మిక మందన్నా జోడిపై లెక్కలేనన్ని వార్తలు వచ్చాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే రూమర్లు కోకొల్లలుగా వచ్చాయి. ఇంకా వస్తూనే ఉంటాయి. విజయ్ ఇంట్లో రష్మిక చేసే అల్లరి, అతని కుటుంబంతో రష్మిక కలిసిపోయే తీరుకు అందరూ ఫిదా అవుతుంటారు. తాజాగా రష్మిక విజయ్ ఇద్దరూ కూడా వర్కవుట్లు మానేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. విజయ్ రష్మికకు సంబంధించిన మ్యాటర్ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఇక ఆ మధ్య రష్మిక చేసిన లైవ్ చాట్.. విజయ్ మీద చేసిన కామెంట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. విజయ్ మంచి స్నేహితుడు అంటూ రష్మిక చెప్పిన మాటలు బాగానే వైరల్ అయ్యాయి. మళ్లీ మీరిద్దరు కలిసి ఎప్పుడు నటిస్తారు? అని ఓ నెటిజన్ అడిగితే.. మీరు ఆ విషయం విజయ్‌నే అడగండి అని సమాధానం ఇచ్చారు. అలా విజయ్ రష్మికల వ్యవహారం ఎప్పుడూ కూడా నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారుతుంది. తాజాగా ఈ ఇద్దరూ జిమ్‌లో వింత వింత పోజులు పెట్టేశారు. వర్కవుట్లు మానేసి సెల్ఫీలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు. వారిద్దరూ అలా పోజులు ఇస్తే.. నేను మాత్రం ఇలా ఫన్నీగా చేస్తుంటాను అని రష్మిక ఓ ఫోటోను షేర్ చేశారు. ఇక మళ్లీ సపరేట్‌గా విజయ్ దేవరకొండతో దిగిన ఫోటోను షేర్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gn4RcN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...