Tuesday, 24 August 2021

Shaakuntalam: సమంత 'శాకుంతలం' ఫినిష్.. వీడ్కోలు చెబుతూ ఎమోషనల్ అయిన చిత్రయూనిట్

స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు ప్రధాన పాత్రలో నటిస్తున్న '' మూవీకి గుమ్మడికాయ కొట్టేశారు. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పౌరాణిక సినిమాలో సమంత లీడ్ రోల్ పోషిస్తోంది. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుతున్న యూనిట్.. విజయవంతంగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేశామని పేర్కొంటూ అఫీషియల్ వీడియో రిలీజ్ చేసింది. దర్శకుడు గుణ శేఖర్, చిత్ర నిర్మాత నీలిమా యూనిట్ మొత్తానికి చిరు కానుకలు ఇచ్చారు. చిత్ర బృందానికి వీడ్కోలు పలుకుతూ దర్శక నిర్మాతలు కాస్త ఎమోషనల్‌గా ఫీల్ కావడం ఈ వీడియోలో చూడొచ్చు. మహాభారతంలోని ఆదిపర్వం నుండి తీసుకున్న శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను 'శాకుంతలం' సినిమాతో వెండితెరపై ఆవిష్కృతం చేయబోతున్నారు గుణశేఖర్. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ నటించారు. సమంత తన కెరీర్‌లో తొలిసారి పౌరాణిక పాత్రలో నటించడం విశేషం. ఇక అక్కినేని కోడలితో అల్లు వారి మనవరాలు, అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇంట్రెస్టింగ్ పాయింట్. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌, గుణటీమ్‌ వర్క్స్‌ పతాకాలపై పాన్ ఇండియా మూవీగా నీలిమా గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో చూపించే యుద్ధ సన్నివేశాలు, సమంత లుక్ హైలైట్ కానున్నాయని టాక్. త్వరలోనే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని సన్నాహాలు చేస్తున్నారు గుణశేఖర్. మరికొద్ది రోజుల్లో రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sLPj7h
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...