Monday, 23 August 2021

#Chiru154: టైటిల్ అదే అంటూ సోషల్‌మీడియాలో ప్రచారం.. అదే జరిగితే ఫ్యాన్స్‌కి పూనకాలే?

మెగాస్టార్ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు తోటీ నటీనటులతో పాటు ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని వాళ్లు సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా సినిమా అప్డేట్లు ఎలా వచ్చాయో అందరికీ తెలిసిందే. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాతో మొదలు పెడితే.. ఆ తర్వాత నటిస్తున్న సినిమా నుంచి కూడా అప్‌డేట్స్‌ని ఇచ్చాయి చిత్ర యూనిట్‌లు. ఇందులో ప్రధానంగా లూసిఫర్ రీమేక్‌గా రూపొందుతున్న చిరంజీవి సినిమా అప్‌డేట్ ఒకటి. తెలుగులో ఈ సినిమా ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్‌తో రూపొందుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి తెలుగులో చిరు రీమేక్ చేస్తున్న వేదాళం రీమేక్‌కి సంబంధించి కూడా అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా తెలుగులో ‘భోళా శంకర్’ అనే టైటిల్‌తో రూపొందుతున్నట్లు.. ఇందులో చిరుకు చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇందుకు సంబంధించి ఓ వీడియిని కూడా విడుదల చేసింది. అయితే దీంతో పాటు ‘చిరు 154’కి సంబంధించిన అప్‌డేట్‌ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్‌. అయితే సినిమా టైటిల్ రివీల్ చేయకుండా కేవలం చిరు బ్యాక్‌సైడ్ నిలుచొని ఉన్న పోస్టర్‌ని మాత్రమే వదిలారు. అయితే ఈ సినిమాకు ‘’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారని ఫ్యాన్స్ మధ్యలో టాక్ వినిపిస్తోంది. విశాఖపట్నానికి చెందిన మత్య్సకారుడి కథ కావడంతో ఈ టైటిల్ అయితేనే బాగుంటుందని వాళ్లు అబిప్రాయపడుతున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mqvKjC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...