Tuesday 31 August 2021

మీరు చేసింది దేశానికే ఆదర్శం.. ప్రతీ భారతీయుడు దాన్ని చూసి గర్వించాలి: చిరంజీవి

ఈ ఏడాది టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది మెడల్స్ పంట పండిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌లో టేబుల్ టెన్నీస్ విభాగంలో భవీనా పటేల్ భారత్‌కు తొలి మెడల్ అందించారు. చైనాకు చెందిన క్రీడాకారిణితో పోటీ పడిన ఆమె.. ఓటమిపాలు అయినప్పటికీ.. రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత.. జావిలిన్ త్రో విభాగంలో సుమిత్, 10మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఈ అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ వీరిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం తలవంచాల్సిందేనని నిరూపించి దివ్యాంగులలో గొప్పస్పూర్తిని నింపేలా పారాలంపిక్ క్రీడలలో దేశానికి పతకాలు అందించిన విజేతలకు అభినందనలు. ఈ విజయాలు ప్రతి భారతీయుడు గర్వించేవి’ అంటూ ఆయన పేర్కొన్నారు. ఇక పారాలింపిక్స్‌లో తొలి స్వర్ణం సాధించిన భారత మహిళగా రికార్డు సృష్టించిన అవని లేఖరాకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇక సినిమాల విషయానికొస్తే.. మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘ఆచార్య’ అనే సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. దీంతో పాటు ఆయన మెహన్ రాజా దర్శకత్వంలో ‘గాఢ్ ఫాదర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక తమిళంలో అజిత్ నటించిన ‘వేదాళం’ సినిమాను తెలుగులో చిరూ రీమేక్ చేస్తున్నారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్‌’ అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలు చిరంజీవికి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. దీంతో పాటు ఆయన మరో సినిమా పనుల్లో కూడా బిజీగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yvkfdk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...