Monday, 23 August 2021

వారికి మాత్రమే చిరు రిప్లై.. ఎవ్వరినీ పట్టించుకోని మెగాస్టార్.. కారణం అదేనా?

మెగాస్టార్ బర్త్ డే (ఆగస్ట్ 22) సందర్భంగా సోషల్ మీడియాలో నిన్న అంతా జరిగిన హంగామా అందరికీ తెలిసిందే. బర్త్ డే విషెస్‌తో సోషల్ మీడియా మొత్తం మార్మోగిపోయింది. టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ కూడా చిరుకు విషెస్ అందించారు. ఇక సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా చిరుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే మాలీవుడ్, కోలీవుడ్ నుంచి కూడా చిరంజీవికి శుభాకాంక్షలు అందాయి. ఇందులో చిరంజీవి మాత్రం కొందరికే రిప్లైలు పెట్టారు. టాలీవుడ్ సెలెబ్రిటీలను చిరు పట్టించుకోలేదు. చిరంజివీకి సినీ రాజకీయ క్రీడా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వచ్చాయి. అందులో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ చిరంజీవికి విషెస్ అందించారు. సచిన్ వేసిన ట్వీట్‌కు చిరంజీవి కూడా బదులిచ్చారు. ఇక రాజకీయ ప్రముఖులైన కేటీఆర్, చంద్రబాబు నాయుడు, కిషన్ రెడ్డి, సోము వీర్రాజు వంటివారు చెప్పిన విషెస్‌కు చిరంజీవి ప్రతిస్పందించారు. సినీ ప్రముఖుల్లో దాదాపు అందరూ కూడా చిరంజీవికి విషెస్ అందించారు. అందులో చిరు స్నేహితులైన మాలీవుడ్ స్టార్స్ , మమ్ముట్టిలకు మాత్రమే చిరు రిప్లై ఇచ్చారు. వారిద్దరు చిరంజీవికి విషెస్ చెబుతూ ట్వీట్లు వేశారు. మన టాలీవుడ్ స్టార్లందరూ కూడా విషెస్ చెప్పారు. కానీ చిరంజీవి మాత్రం ఎవ్వరికీ కూడా రిప్లై ఇవ్వలేదు. ఎన్టీఆర్, మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున ఇలా ఎవ్వరికీ కూడా రిప్లై ఇవ్వలేదు. అయితే చిరంజీవి నిన్న అంతా కూడా బర్త్ డేతో బిజీగా ఉన్నారని, అంతే కాకుండా రాఖీ సెలెబ్రేషన్స్‌లోనూ ఇళ్లంతా సందడిగా మారిపోయివడంతో అందులోనే పూర్తిగా నిమగ్నమయ్యారని తెలుస్తోంది. అందుకే చిరు ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండలేకపోయారని, రిప్లై ఇవ్వలేకపోయారని తెలుస్తోంది. మరి ఈ రోజు అందరికీ వరుసబెట్టి గత ఏడాది మాదిరి రిప్లైలు ఇస్తారేమో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zabhmB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...