Monday, 12 July 2021

RAPO 19: రామ్ ఫ్యాన్స్ హుషారెత్తే ఆసక్తికర అప్‌డేట్.. ఇదే టైటిల్‌ ఫైనల్!

ఎనర్జిటిక్ స్టార్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్‌ లింగుస్వామి దర్శకత్వంలో ఓ ప్రాజెక్టు రూపొందుతున్న సంగతి తెలిసిందే. రామ్ కెరీర్‌లో 19వ సినిమాగా ‘రాపో 19’ అనే వర్కింగ్ టైటిల్‌‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది. నేటి నుంచి (జూలై 12వ తేదీ) రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు రీసెంట్‌గా చిత్ర యూనిట్‌ తెలిపింది. కాగా తాజాగా ఈ మూవీ టైటిల్ విషయమై ఓ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ ఇమేజ్ రెట్టింపు చేసుకున్న రామ్ కోసం.. ఊరమాస్ టైటిల్ ఉండాలని భావించిన డైరెక్టర్ 'ఉస్తాద్' అనే పేరును పరిశీలనలో పెట్టారట. ఇదే టైటిల్ కథకు కూడా బాగానే యాప్ట్ అవుతుందని అనుకుంటున్న ఆయన, అతి త్వరలో దీనిపై అఫీషియల్ ప్రకటన ఇవ్వనున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. ఈ టైటిల్ చూసి రామ్ ఫ్యాన్స్ కూడా కేక అంటూ రెస్పాన్స్ ఇస్తుండటం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా రామ్ తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుండగా.. లింగుస్వామికి ఇది తొలి తెలుగు చిత్రంగా నిలువనుంది. ‘ఉప్పెన’ సినిమాలో తన నటనతో అందరిని మెప్పించిన కృతి శెట్టి ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. ఎస్ఎస్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రామ్ తన కెరీర్‌లోనే తొలిసారిగా ఓ పవర్‌ఫుల్ పోలీస్ అఫీసర్ రోల్‌లో నటిస్తున్నాడట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2U4tSkK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...