Tuesday, 20 July 2021

‘పేపర్‌బాయ్’తో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇక అన్ని ‘మంచి రోజులే’నంటా!

టాలీవుడ్‌లో వినోదాత్మక చిత్రాలు రూపొందించడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ . ‘ప్రేమ కథా చిత్రం’, ‘భలే భలే మగాడోవోయ్’ సినిమాలతో ఆయనిచ్చిన కామెడీ టచ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అదే బాటలో ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఆయన.. ఈ మూవీ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన సినిమాలపై ఎన్నో రూమర్లు పుట్టుకొచ్చాయి. హీరో సంతోష్ శోభన్‌తో త్వరలో ఆయన సినిమా చేయనున్నారనే టాక్ బలంగా వినిపించింది. ఇప్పుడు ఆ టాక్‌ నిజమైంది. హీరోగా, మారుతి డైరక్షన్‌లో ‘మంచి రోజులు మొదలయ్యాయి’ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్‌గా చేస్తోంది. ‘పేపర్‌ బాయ్’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంతోష్.. తాజాగా ‘ఏక్ మినీ కథ’ అనే సినిమాతో మంచి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో సంతోష్ సినిమా చేస్తున్నాడంటే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అందులోనూ మెహ్రీన్ హీరోయిన్ కావడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు మారుతి. ‘ఆలోచించిన వెంటనే జరిగిన పని ఇది’ అంటూ ఈ సినిమా గురించి ఆయన పేర్కొన్నారు. త్వరలో థియేటర్లలో ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది అని స్పష్టం చేశారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3y5uEN6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...