Wednesday, 21 July 2021

వెంటిలేటర్‌పై అరియానా.. సడెన్ షాక్! స్వయంగా ఫొటో షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ

ఏ నిమిషం ఎవ్వరి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఊహించడం కష్టం. ఒక్కోసారి కనిపించే కొన్ని దృశ్యాలు సడెన్ షాకిస్తుంటాయి. ఏంటిది నిజామా? అని ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. బిగ్ బాస్ బ్యూటీ విషయంలో అదే జరిగింది. అలాంటి ఓ దృశ్యాన్ని స్వయంగా షేర్ చేసింది అరియానా. ఇది చూసి ఆమె ఫాలోవర్స్ అవాక్కయ్యారు. ఇందుకు కారణం ఆమె వెంటిలేటర్ మీద ఉండటం. మరి ఇంతకీ అరియానాకు ఏమైంది? వెంటిలేటర్ మీదకు ఎందుకెళ్లింది? అనేది చూద్దామా.. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అరియానా.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్‌తో ఫేమస్ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టి బోల్డ్ బ్యూటీగా ఫుల్ పాపులర్ అయింది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్ రోల్ పోషిస్తూ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను షేర్ చేస్తోంది. ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్న ఆమె.. తాజాగా తాను వెంటిలేటర్‌పై ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేసి షాకిచ్చింది. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్ లోనిది అని పూర్తిగా చూశాక అర్థమవుతోంది. మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా చేస్తోన్న ఓ సినిమాలో కీలకమైన పాత్ర పోషిస్తోంది అరియానా. ఇందులోని ఓ సీన్ కోసం ఆమె ఆక్సీజన్ మాస్కుతో వెంటిలేటర్ మీద ఉన్నట్లు నటిస్తోంది. ఆ షూటింగ్ స్పాట్‌లో తీసిన వీడియోనే ఆరియానా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eLue75
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...