Wednesday, 14 July 2021

ఆడవాళ్లకు బాత్రూంలంటే ఇష్టం!.. సెల్ఫీలతో పూనమ్ కౌర్ హల్చల్

నటి సోషల్ మీడియాలో చేసే హల్చల్ అంతా ఇంతా కాదు. ఆమె వేసే ట్వీట్లు, చేసే పోస్ట్‌లు ఎప్పుడూ కూడా కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంటాయి. అలా పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారుతుంటారు. మొన్నటికి మొన్న కత్తి మహేశ్ మృతిపై ఎవ్వరూ ఊహించని విధంగా రియాక్ట్ అయ్యారు. కనీసం పేరు కూడా ఎత్తకుండా పూనమ్ కౌర్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అయింది. ఆమె ప్రతీ సారి కూడా ఎవ్వరినీ పేరు పెట్టి, నేరుగా విమర్శించరు. స్పందించరు. అలా పూనమ్ ఇది వరకు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ వంటి వారిపై పోస్ట్‌లు చేశారు. అవి తెగ వైరల్ అయ్యాయి. అలా ఒకానొక సమయంలో పూనమ్ కౌర్ ట్వీట్లకు ఎక్కువ డిమాండ్ పెరిగింది. ఇక సుశాంత్ సింగ్ మరణం తరువాత సినిమా ఇండస్ట్రీ, నెపోటిజం,అవకాశాలు, డిప్రెషన్, క్యాస్టింగ్ కౌచ్ వంటి అంశాలపై పూనమ్ కౌర్ స్పందించారు. ఇండస్ట్రీలోని ఓ పెద్ద డైరెక్టర్ తనను ఎంతలా అవమానించారో చెబుతూ ఎమోషనల్ అయ్యారు. పూనమ్ కౌర్ ఇప్పుడు వివాదాలకు దూరంగా ఉంటున్నారు. తన పని ఏదో తాను చేసుకుంటున్నారు. కరోనా సమయంలో తనకు చేతనైన సాయం చేసుకుంటూ ఉంటున్నారు. అయితే తాజాగా పూనమ్ కౌర్ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. అందాల ఆరబోతలోనూ హద్దుల్లో ఉండే పూనమ్ తాజాగా రెచ్చిపోయారు. ఆడవాళ్లకు బాత్రూంలు అంటే ఇష్టమని చెబుతూ.. అందులో దిగిన సెల్పీలను షేర్ చేశారు. ఇక ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. పూనమ్ కౌర్ వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా అభిమానులను సంపాదించుకున్నారు. స్వర్ణఖడ్గం సీరియల్‌తో పూనమ్ కౌర్ ఎంతో మందికి చేరువయ్యారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VyDi8y
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...