Thursday, 15 July 2021

అర్హ డైలాగ్స్ అదిరిపోతాయ్.. అసలు విషయం చెప్పిన సమంత

అల్లు అర్జున్ ముద్దుల కూతురు తెరంగేట్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. గుణ శేఖర్ కాంబినేషన్‌లో రాబోతోన్న అనే ఫాంటసీ చిత్రంతో అర్హ నటిగా ఎంట్రీ ఇవ్వబోతోంది. శకుంతల కుమారుడు భరతుడి పాత్రలో అర్హ నటించబోతోన్నట్టుగా ప్రకటించారు. అయితే ఇందులో అర్హ పాత్ర తీరు తెన్నుల గురించి తాజాగా సమంత చెప్పుకొచ్చారు. పైగా ఫస్ట్ షాట్, సీన్ ఎలా చేసిందో కూడా సమంత చెప్పుకొచ్చారు. అల్లు వారి నాల్గో తరం కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారంటూ బన్నీ ఎమోషనల్ అయిన తీరు అందరికీ తెలిసిందే. ఇక సమంత సైతం అర్హను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నట్టు కనిపిస్తోంది. తన డైలాగ్స్, సీన్స్ విషయంలో అర్హను సమంత బాగా చూసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ మధ్యే మొదలైన ఈ మూవీ షూటింగ్‌లో నిన్న అర్హ జాయిన్ అయింది. ఈ మేరకు శాకుంతలం టీం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇలా తన కూతురు ఇంత గొప్ప ప్రాజెక్ట్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతోండటంతో బన్నీ కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక అర్హ ఎంట్రీపై సమంత కామెంట్ చేశారు. ఫస్ట్ టేక్ అయిపోయింది. అదరగొట్టేసింది. ఆమెకు రాసిన డైలాగ్స్ అన్నీ కూడా అదిరిపోతాయ్.. సూపర్‌గా ఉన్నాయి.. అని సమంత చెప్పుకొచ్చారు. ఇక సమంత చేసిన ఈ పోస్ట్ మీద స్నేహారెడ్డి స్పందించారు. షాట్స్‌లో అర్హకు సాయం చేస్తున్నందుకు థ్యాంక్స్ సమంత అని పేర్కొన్నారు. సమంత పోస్ట్ మీద బన్నీ కూడా స్పందిస్తూ.. థ్యాంక్యూ సో మచ్ అని చెప్పేశారు. మొత్తానికి శాకుంతలం సినిమా అర్హ దెబ్బతో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xMoOAd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...