Saturday, 10 July 2021

తల్లిగా మారనున్న కాజల్ అగర్వాల్.. అయోమయ స్థితిలో ఫ్యాన్స్.. అసలు విషయం ఏంటంటే..

‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దు గుమ్మ . తొలి సినిమా అంతగా హిట్‌ కానప్పటికీ. ఈ అమ్మడు ఆ తర్వాత నటించిన ‘చందమామ’ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అనంతరం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘మగధీర’ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోలేదు కాజల్. దక్షిణాది దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించి.. నెం.1 హీరోయిన్‌గా ఎదిగింది. తాజాగా ఓ పక్క సినిమాలు చేస్తూనే.. మరోపక్క ఓటీటీలపై కూడా దృష్టి పెట్టింది ఈ పంచదార బొమ్మా. ఆ మధ్య హాట్‌స్టార్‌లో వచ్చిన ‘లైవ్ టెలికాస్ట్’ అనే సినిమాతో మంచి హిట్‌ని అందుకుంది కాజల్. ఇక కాజల్‌కి సౌత్ ఇండస్ట్రీల్లో ఏ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆమె అంటే కొన్ని కోట్ల మంది పడి చచ్చిపోతారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే గత ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో కాజల్ తన ఫ్యాన్స్‌కి ఊహించని షాక్ ఇచ్చింది. తన చిరకాల మిత్రుడు, ప్రేమికుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చూసుకుంటున్నట్లు కాజల్ ప్రకటించి తన అభిమానులను ఆశ్చర్యపరిచింది. కాజల్ పెళ్లి జరిగింది అని తెలిసి కొందరు అభిమానులు బాధలో మునిగిపోయారు కూడా. అయితే తాజాగా కాజల్ తల్లి కాబోతుందట. అవును మీరు చదివింది నిజమే. కాజల్ త్వరలో ఓ బిడ్డకి తల్లిగా మనందరికీ కనిపించనుంది. అయితే అది వ్యక్తిగతంగా కాదు.. సినిమా కోసం. తమిళంలో రూపొందుతున్న ‘’ అనే సినిమాలో కాజల్ నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె డీగ్లామరైజ్డ్ పాత్రలో కనిపించనుంది. తల్లి కూతుళ్ల సెంటిమెంట్ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ ఓ అమ్మాయికి తల్లిగా సత్తా వున్న క్యారెక్టర్ చేయనుందని తెలుస్తోంది. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించనుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qYzBF0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...