Wednesday, 21 July 2021

‘అందాల రాక్షసి’కి చేదు అనుభవం.. వెంటనే సమాధానం చెప్పాలంటూ విమానయాన సంస్థపై ఫైర్

‘అందాల రాక్షసి’ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఆమె.. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న హీరోలందరితోనూ నటించి.. తాను కూడా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ ఏడాది ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆమె.. ప్రస్తుతం ‘రాయబారి’ అనే సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటు ఆమె మరికొన్ని ప్రాజెక్టులకు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే సినిమా షూటింగ్‌ల కోసం నటీనటులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం కచ్చితంగా ఉంటుంది. మరింత వేగవంతంగా వెళ్లేందుకు వాళ్లు విమాన ప్రయాణాలు చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో సాంకేతిక లోపాలు, ఇతర కారణాల వల్ల ఈ ప్రయాణాలకు అంతరాయం ఏర్పడుతుంది. తాజాగా లావణ్యకు ఇదే సమస్య వచ్చింది. తాను ప్రయాణించాల్సిన విమానం క్యాన్సిల్ కావడంతో ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియాను ట్యాగ్ చేసిన ఆమె.. విమానం క్యాన్సిల్ అవుతుందనే విషయాన్ని ముందస్తుగా ఎందుకు తెలియజేయలేదు అంటూ ప్రశ్నించింది. ఇంకో విమానంలో సీటు బుక్ చేసుకున్న తర్వాత తనకు మెసేజ్ రావడం ఏంటని ఆమె మండిపడింది. ఇలాంటి ఘటన గతంలో ఎవరికైనా జరిగిందా.. లేదా తనకే మొదటిసారి జరిగిందా అంటూ ఆమె అభిమానులను అడిగింది. మరి దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xX6nsO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...