Thursday, 15 July 2021

అలాంటి పనులన్నీ కేరవ్యాన్‌లోనే.. పబ్లిక్‌గా అలా చేయడంతో హీరోయిన్‌పై డైరెక్టర్ ఫైర్

తమిళ నటి ఎప్పుడూ కూడా కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గానే ఉంటారు. ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ ఆమె వేసే ట్వీట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. హీరో హీరోయిన్లను ఆమె టార్గెట్ చేసే తీరే భిన్నంగా ఉంటుంది. బిగ్ బాస్ షోతో ఈ భామ కాసింత వెలుగులోకి వచ్చింది. సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా కూడా అంతగా పేరు రాలేదు. కానీ వివాదాస్పద ట్వీట్లు, కామెంట్లు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటుంది. ఇక అందాల ఆరబోతలో మాత్రం ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంటుంది. తాజాగా మీరా మిథున్ వ్యవహారం నెట్టింట్లోవైరల్ అవుతోంది. ఈమె సెట్‌లో చేసే భాగోతం గురించి ఓ దర్శకుడు ఇటీవలె బయటకు చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ అమ్మడు నటిస్తున్న ఓ చిత్రంలో తాను అనుసరిస్తున్న పద్ధతిని మార్చుకోవాలంటూ సదరు చిత్ర దర్శకుడు వార్నింగ్‌ ఇచ్చాడట. మోడలింగ్ నుంచి ఇండస్ట్రీ లోకి వచ్చిన మీరా మిథున్ దూకుడుగా వ్యవహరిస్తుంటుంది. ప్రస్తుతం మీరా ‘పేయైు కాణోమ్‌’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో కౌశిక్‌ అనే యువకుడు తొలిసారి హీరోగా పరిచయం కానున్నాడు. అన్బరసన్‌ అనే నూతన దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సాధారణంగానే సిగరెట్‌ తాగే అలవాటు ఉన్న మీరా, ఇటీవల షూటింగ్‌ లొకేషన్‌లో సిగరెట్‌ తాగుతూ కెమెరాకు చిక్కడంపై దర్శకుడు కాస్త అసహనం వ్యక్తం చేశాడట. సిగరెట్‌ తాగడం, ఆమె వ్యక్తిగత వ్యవహారం. షూటింగ్‌ లొకేషన్‌లోనే అలా సిగెరెట్లు తాగడం సరికాదని, కేరవాన్‌లో తాగి రావాలని చెప్పాను. ఆ తర్వాత ఆమె ఇది రిపీట్‌ చేయలేదని సదరు దర్శకుడు చెప్పుకొచ్చాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UIzvoS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...