Monday, 12 July 2021

నాని డేరింగ్ స్టెప్.. రియల్ హీరో బయోపిక్ కోసం రెడీ! మరోసారి రిపీట్ కాబోతున్న సక్సెస్‌ఫుల్ కాంబో

కెమెరా ముందు ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే లీనమై తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకున్నారు . నాచురల్ యాక్టింగ్ స్కిల్‌తో నాచురల్ స్టార్‌గా పేరుతెచ్చుకున్న ఆయన కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలతో అలరిస్తున్నారు. అద్భుతమైన నటనతో ప్రతి సినిమానూ వన్ మ్యాన్ షోగా మార్చేసే ఈ హీరో తన మార్కెట్‌ను కూడా పెంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారట నాని. 'జెర్సీ' సినిమాతో భారీ హిట్‌ అందుకుంది గౌతమ్ తిన్ననూరి- నాని కాంబో. అయితే ఇదే కాంబోలో మరో సినిమాను రాబోతోందని ఎప్పటినుంచో వార్తలు వస్తుండగా.. తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. వీళ్లిద్దరి కాంబోలో వచ్చే ఈ సినిమా యుద్ధంలో కాళ్లు కోల్పోయిన ఓ సైనికుడి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందనుందని అంటున్నారు. అంటే ఇందుకోసం నాని డేరింగ్ స్టెప్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. పాన్ ఇండియా రేంజ్‌తో పలు భాషల్లో రూపొందించాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారట. ఇందుకు సంబంధించి ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ వర్క్ షురూ చేశారట. ప్రస్తుతం నాని ఫుల్ బిజీగా ఉన్నారు. వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెట్టిన ఆయన.. శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' సినిమా చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. మరోవైపు 'శ్యామ్ సింగరాయ్', 'అంటే.. సుందరానికీ' సినిమాల్లో నటిస్తున్నారు నాని. ఇవన్నీ ఫినిష్ అయ్యాకే గౌతమ్ తిన్ననూరి- నాని కాంబో సెట్స్ మీదకు రానుందని సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hAxvYV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...