Monday, 12 July 2021

అతను నా వెనకున్నాడు.. ఇక నన్ను ప్రపంచంలో ఎవ్వరూ బాధపెట్టలేరు : రేణూ దేశాయ్

తాజాగా చేసిన పోస్ట్ అందరినీ షాక్‌కు గురి చేసి ఉంటుంది. రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అంత సైలెంట్‌గా ఉంటారు. అకీరాను చూపించండి అని ప్రతీసారి రేణూ దేశాయ్‌ను అడుగుతుంటారు అభిమానులు. లైవ్‌లోకి వచ్చిన ప్రతీసారి అకీరా గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి. అతడ్ని రమ్మన్నా రాడు.. ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు.. సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు అని చెబుతూ ఉంటారు. అలాంటి రేణూ దేశాయ్ తాజాగా తన కుమారుడి ఫోటోను షేర్ చేశారు. అకీరా నందన్ ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించవు. ఏదైనా ప్రత్యేక సందర్భాల్లోనే అకీరా సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. పండుగలు, ఏదైనా స్పెషల్ ఈవెంట్ ఉన్నప్పుడే అకీరా సోషల్ మీడియాలో కనిపిస్తారు. ఆ మధ్య ఓ సారి అకీరా ఫోటోను షేర్ చేస్తూ.. నన్ను ఎప్పుడైనా, ఎలాంటి సందర్భంలోనైనా సరే నవ్వించగల వ్యక్తి, సంతోషంగా చూసుకునే వ్యక్తి ఒక్కరే అని అకీరా గురించి చెప్పుకొచ్చారు. తాజాగా మరోసారి అకీరా నందన్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఓ కామెంట్ పెట్టారు. అద్భుతమైన వ్యక్తి నా వెనకలా ఉన్నప్పుడు.. ఈ ప్రపంచంలో ఏదీ కూడా నన్ను బాధించలేదు.. ఎవ్వరూ కూడా బాధపెట్టలేరు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అయితే ఇన్ స్టాగ్రాంలో కామెంట్ల సెక్షన్‌ను డిసబుల్ చేసి ఈ పోస్ట్ చేయడంతో ఎక్కువగా వైరల్ అవ్వడం లేదు. లేకపోయి ఉంటే ఈ పాటికి జూనియర్ పవర్ స్టార్ అంటూ ఓ ట్రెండ్ వైరల్ అయ్యేది. నెగెటివ్ కామెంట్లు ఎక్కువ అవుతున్నందున రేణూ దేశాయ్ ఈ మధ్య కామెంట్ సెక్షన్‌ను క్లోజ్ చేసేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2U0FmG3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...