Friday, 16 July 2021

‘బాయ్స్‌’ కోసం కదలి వచ్చిన సన్నీ లియోనీ.. సెన్సేషనల్ సినిమా టీజర్ లాంచ్

బాలీవుడ్ హాట్ బ్యూటీ గురించి తెలియని సినీ ప్రేక్షకుడు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆమె గతాన్ని పక్కనపెడితే బాలీవుడ్‌లోకి వచ్చిన తర్వాత నటనపరంగా.. డ్యాన్స్ పరంగా ఆమె ప్రేక్షకులను ఎంతో అలరించారు. ‘రాగిణి ఎమ్మెమెస్-2’ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఆమె ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు సాధించారు. అంతేకాక.. సామాజికసేవలల్లో కూడా చాలా హుషారుగా పాల్గొంటూ ఆమె తన మంచి తనాన్ని కూడా నిరూపించుకున్నారు. తాజాగా టాలీవుడ్‌కి చెందిన ‘’ కోసం సన్నీ లియోనీ కదలి వచ్చారు. అయితే అది నిజంగా అబ్బాయిల కోసం కాదండోయ్.. దయానంద్ దర్శకత్వంలో , మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న న్యూ ఏజ్ అడల్డ్ రొమాంటిక్ స్టోరీగా దర్శకుడు దయానంద్ ఈ సినిమాని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్, ‘రాజా హే రాజా’ అనే పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా సన్నీ లియోనీ ఈ సినిమా టీజర్‌ని లాంచ్ చేయడం సినిమాకు మరింత హైప్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్‌మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో గీతానంద్‌తో పాటు.. రోవిత్, అన్షులా ధావన్, శ్రీహాన్ జెన్నిఫర్, షీటల్ తివారీ, సుజీత్, బమ్చిక్ బల్బూ, కౌషల్ మండా తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేసిన సన్నీ చిత్ర యూనిట్‌కి బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక ఈ టీజర్‌లో మూడు జంటల మధ్య జరిగే రొమాన్స్, కిస్సింగ్ సీన్లు ఇతర అడల్ట్ కంటెట్ ప్రధానంగా ఉన్నాయి. హీరోయిన్లు బికినీలు ధరించి ప్రేక్షకులకు కావాల్సినంత అందాల ఆరబోత అందించారు. మరి ఇంత అడల్ట్ కంటెంట్ ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్‌లో అలరిస్తుందో వేచి చూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kmJsTL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...