Thursday 29 July 2021

చిరంజీవి అందరికీ అన్నయ్యే.. ఛాన్స్ అడిగితే డైరెక్టుగా ఆ మాట అన్నారు! సాయి కుమార్ కామెంట్స్ వైరల్

టాలీవుడ్ రారాజు మెగాస్టార్ అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. దశాబ్దాల కాలంగా తెలుగు చిత్రసీమలో ఓ వెలుగు వెలుగుతున్న ఆయన ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరితో ఎంతో స్నేహంగా మెదులుతుంటారు. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా తోటి హీరోలందరితో సరదా ఉంటూ సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అయితే ఓ సందర్భంలో తాను ఛాన్స్ అడిగితే చిరంజీవి రియాక్షన్ ఎలా ఉందనే విషయాన్ని బయటపెడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యాక్టర్ . డబ్బింగ్ ఆర్టిస్టుగానే కాక హీరోగా, విలన్‌గా, తండ్రిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో పాత్రలకు తన నటనతో జీవం పోసిన సాయి కుమార్.. ప్రస్తుతం '' అనే సినిమాలో నటిస్తున్నారు. ఆగస్టు 6వ తేదీన విడుదలకు రెడీ అయిన ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేయగా.. సాయి కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన నట జీవితాన్ని గుర్తు చేసుకున్న ఆయన, ఇంకా మంచి మంచి వేషాలు చేయాలనేదే తన గోల్ అని చెప్పారు. ఇటీవల తన షష్టిపూర్తి సందర్భంగా చిరంజీవిని కలిసి సినిమా అవకాశాల గురించి మాట్లాడానని చెప్పిన సాయి కుమార్.. అన్నయ్య మళ్ళీ నీ సినిమాలో ఏదైనా మంచి పాత్రలో నటించాలని ఉందని అడిగానని, అందుకు చిరంజీవి బదులిస్తూ రొటీన్ అయిపోయావు రా.. అవే వేషాలు వేస్తున్నావు. ఏదైనా కొత్తగా ట్రై చెయ్.. కొత్తగా ఆలోచించారా అని అన్నారని పేర్కొన్నారు. అన్నయ్య.. మీ కోరిక ఈ 'SR కళ్యాణమండపం' సినిమా తీరుస్తుందని, ఈ సినిమాలో నా క్యారెక్టర్ మిమ్మల్ని కొంతమేరైనా తృప్తి పరుస్తుందని నమ్ముతున్నాను అని ఈ సందర్భంగా సాయి కుమార్ అన్నారు. ఈ సినిమాలో సాయి కుమార్ విభిన్నమైన పాత్రలో నటించారని, ఆయన రోల్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ అవుతుందని సమాచారం. 'రాజావారు రాణివారు' సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం ఈ మూవీలో లీడ్ రోల్‌ పోషిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zLD5xI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...