Sunday, 18 July 2021

పూజా హెగ్డే తర్వాత టాలీవుడ్‌లో ఎంట్రీకి రెడీ అయిన మరో ‘హెగ్డే’ భామ

‘ఒక లైలా కోసం’, ‘ముకుందా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి పూజా హెగ్డే. ఆ తర్వాత ‘డీజే’, ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘మహర్షి’ తదితర చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ ఎవరంటే ముందుగా అందరు పూజా పేరే చెబుతారు. 2020లో ‘అల వైకుంఠపుములో’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆమె.. ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘రాథే శ్యామ్’, ‘ఆచార్య’, ‘బీస్ట్’ వంటి భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. అయితే ఇప్పుడు తర్వాత మరో హెగ్డే టాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతోందట. అనే నటి త్వరలో తెలుగు వెండితెరకు పరిచయం కానుంది. ముంబైకి చెందిన ఈ భామ ఇప్పటికే భోజ్‌పూరి, మరాఠీ, పంజాబీ సినిమాల్లో నటించింది. తాజాగా వెంకట్ క్రిష్ణణ్ దర్శకత్వంలో ‘మణి శంకర్’ అనే సినిమా ద్వారా తెలుగులో ఆరంగేట్రం చేయనుంది. ఈ సందర్భంగా ఆమె సినిమాకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించింది. ఈ సినిమా స్క్రీన్‌ప్లే ఆడియన్స్‌ని సీట్లలో కూర్చొనివ్వదని పేర్కొన్న ఆమె.. ఇలాంటి సినిమాతో తెలుగులో అడుగుపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని స్ఫష్టం చేసింది. హైదరాబాద్‌లో తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఫఖ్కిపై పలు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు దర్శకుడు వెంకట్.. ‘‘నేను చాలా శక్తివంతమైన, ప్రేమ, ద్వేషం ఇలా అన్ని ఎమెషన్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాను. ఈ సినిమా కోసం చాలా యాక్షన్ సీన్లు చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా రాయల్ ఎన్‌పీల్డ్ బండి నడపడం చాలా కష్టంగా ఉండేది. అది చాలా బరువుగా ఉంది. ఈ స్టంట్లు అన్ని రెండు రోజుల్లో పూర్తి చేయడం కూడా మరింత సవాలుగా ఉంది’ అంటూ పఖ్కీ పేర్కొంది. ఈ సినిమా కోసం కారు డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను అని ఆమె తెలిపింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rkASXe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...