Wednesday 30 June 2021

కత్తి మహేష్ చనిపోవాలంటూ దారుణమైన పోస్ట్‌లు.. ఖుషీ డైలాగ్‌తో IPS పీవీ సునీల్ కుమార్ కౌంటర్

నెల్లూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మూవీ క్రిటిక్ మహేష్ కత్తి తీవ్ర గాయాల పాలై.. చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కొన్నాళ్లు పాటు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స తీసుకోనున్నారు. తలకి తగిలిన గాయాలు నయం అవుతుండగా.. నుదిటి ఎముకకు, ముక్కుకు శస్త్ర చికిత్సలు పూర్తయ్యాయి. అయితే కంటికి బలమైన గాయాలు కావడంతో పలు దఫాలుగా ఆపరేషన్స్ చేయనున్నారు శంకర ఆసుపత్రి వైద్యులు. అయితే కంటి చూపు కోల్పోయే ప్రమాదం లేదని తెలుస్తోంది. ఇదిలాఉంటే.. కత్తి మహేష్‌కి యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి సోషల్ మీడియాలో ప్రత్యేకించి ఒక వర్గం దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. మానవత్వం మరిచిపోయి కత్తి మహేష్ చనిపోవాలంటూ వరుస పోస్ట్‌లు పెడుతున్నారు. కళ్లు పోయాయని.. చనిపోతాడని.. ఘోరమైన చావు రావాలని ఇలా రకరకాల కామెంట్లు పెడుతూ తెగ సంబరపడుతున్నారు. ఇక కత్తి మహేష్ తిరిగి కోలుకుంటున్న తరువాత కూడా.. దారుణమైన కామెంట్లు పెడుతూనే ఉన్నారు. అయితే వీటిపై ఐపీఎస్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్‌ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తూ.. కొంతమంది తన సన్నిహితులను చెన్నైకి పంపి మరీ కత్తి మహేష్ కుటుంబానికి భరోసా ఇచ్చారు పీవీ సునీల్‌కుమార్‌. అయితే చావుబతుకుల మధ్య ఉన్న కత్తి మహేష్ ఆరోగ్యంపట్ల మానవత్వం చూపించాల్సింది పోయి.. కొంతమంది దారుణంగా కామెంట్లు పెడుతుండటంతో వీపీ సునీల్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు. ‘కత్తి మహేష్ త్వరగా కోలుకోవాలని ఆశిద్దాము.. సాటి మనుషులుగా ఒక వ్యక్తి చావు బతుకుల మధ్య ఉన్నపుడు సానుభూతి చూపించాలి.. అంతే తప్ప అతడి నిస్సహాయ స్థితి ఎవరికైనా సంతోషం కలిగించింది అంటే ఆ తప్పు వారిది కాదు. ఏది తప్పో ఏది ఒప్పో తెలీకుండా వాళ్ళని అలా పెంచి సమాజం మీదికి ఒదిలిన తల్లితండ్రులది. ఇంత కిరాతక సమాజంలో బతుకుతున్నామా అనిపించేలా ఉంది పరిస్థితి. తనను విమర్శించిన వ్యక్తిపై దాడి జరిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదార్చిన గొప్ప మానవతా వాది చిరంజీవి గారి లాంటి వారి నుండి నేర్చుకోవలసింది ఆ మానవత్వం. ఈ సందర్భంలో నా అనుభవాలు రెండు చెప్పాలి. మా బంధువుల్లో నా మీద విషం చిమ్మే ఒక వ్యక్తి కి హార్ట్ సర్జరీకి డబ్బు అవసరం అయ్యింది. కన్న బిడ్డలు మొహం చాటేశారు. నేను పూర్తి డబ్బు కట్టాను. ఆ వ్యక్తి కోలుకుని బతికి కొన్నాళ్ళపాటు నన్ను దేవుడు అని పొగిడి తిరిగి విషం చిమ్మే పని ప్రారంభించాడు. పెడితే పెళ్ళి.. పెట్టకపోతే చావు కొంతమందికి అలానే నిత్య పరగడుపు.. మనిషికి కృతజ్ణత ఉండవచ్చు.. అది సహజం. కానీ పాముకీ, తేలుకీ విషం కక్కటం సహజం అలాంటి మనిషికి సాయం చేసినందుకు నేను బాధ పడను. వాళ్ళు పోవాలని కోరుకోను.. శత్రువు మారాలి లేదా ఓడిపోవాలి అని కోరుకోవచ్చు.. కానీ చనిపోవాలని కాదు. ఎవరేం చేసినా ఖుషీ సినిమాలో విజయ్ కుమార్ సిద్దుతో అన్నట్టు "మనకి అన్నిటికీ నవ్వే " అంటూ పోస్ట్ పెట్టారు .


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3h7gaqk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...