Tuesday 29 June 2021

'హర హర వీరమల్లు' హైలైట్ పాయింట్ అదే.. అందుకోసం భారీ మొత్తం ఖర్చు చేస్తున్న నిర్మాత!

'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి 'వకీల్ సాబ్' రూపంలో తిరిగి కెమెరా ముందుకొచ్చారు పవర్ స్టార్ . రీ- ఎంట్రీ తర్వాత తొలి సినిమాతోనే భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్న ఆయన.. వరుసపెట్టి భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. అందులో ఒకటే క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ''. శరవేగంగా షూటింగ్ జరిపి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న క్రిష్.. షూటింగ్ కోసం వేసే సెట్స్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదట. 17వ శతాబ్దం నేపథ్యంలో పీరియాడికల్‌ డ్రామాగా ఈ 'హరి హర వీరమల్లు' ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం 180 కోట్ల మేర బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథ కళ్ళకు కట్టినట్లుగా ఉండేలా భారీ సెట్స్ వేస్తున్నారట. కథపై ఉన్న నమ్మకంతో నిర్మాత ఎ.ఎం రత్నం కూడా ఖర్చు విషయంలో వెనకాడటం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. 'హరిహర వీరమల్లు' మూవీ కోసం భారీ సెట్టింగ్స్ నిర్మిస్తున్నట్లు గతంలోనే ప్రకటించిన యూనిట్.. ఇప్పుడు ఓ ఫిల్మ్ స్టూడియోలో ఆగ్రా కోట సెట్టింగ్‌ చేస్తున్నారట. ఈ ఒక్క సెట్టింగ్ కోసం 10 కోట్లు వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అతిత్వరలో ప్రారంభం కాబోయే షూటింగ్‌కి ఈ భారీ సెట్ వేదిక కానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో పవన్ ఫైట్ సీక్వెన్స్‌లు చిత్రీకరించనున్నారట. ఇక్కడ షూట్ చేయబోయే సన్నివేశాలే సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ఆరో మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో కనిపించబోతున్నారు. పిరియాడిక్ జానర్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై జనాల్లో భారీ హైప్ క్రియేట్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Uc1Tj3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...