సోషల్ మీడియాలో ఎంత సరదాగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇక తన సోదురుడు ప్రీత్‌తో కలిసి చేసే అల్లరి ఎప్పుడూ వైరల్ అవుతుంది. గత ఏడాది లాక్డౌన్‌లో ఈ బ్రదర్ సిస్టర్స్ ఆడుకున్న ఆటలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తమ పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మాల్దీవుల్లో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. బికినీలో రకుల్ రచ్చ చేయడం, సోదరుడితో కలిసి సెల్ఫీలు దిగడంతో అంతా షాక్ అయ్యారు. అలా రకుల్ చేసే ప్రతీ పనీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది.తాజాగా రకుల్ వంటింట్లోకి దూరారు. మామూలుగా అయితే ఈ తరంలోని కొంత మంది అమ్మాయిలకు తమ ఇంట్లో వంటగది ఎక్కడుందో కూడా తెలీదు. కొందరికి వంటలు చేయడం కూడా రాదు. అయితే రకుల్ కూడా ఈ కేటగిరీకే చెందినట్టు కనిపిస్తోంది. అమన్ తాజాగా వదిలిన వీడియో దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. తాజాగా రకుల్ ఓ వంటకాన్ని ప్రిపేర్ చేశారు. దీంతో వంట గదిలో తన అక్క చేస్తోన్న ఈ ప్రయోగాన్ని అమన్ వీడియో తీశారు. అక్కా.. ఏం చేస్తున్నావ్ అని అడగడం.. ఆ వంటకం పూర్తిగా మాడిపోవడంతో రకుల్ దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు. ప్యాన్ కేక్ అని చెప్పడంతో షాక్ అయ్యారు. అలా రకుల్ చేసిన స్పెషల్ డిష్ తినకపోవడమే మంచిది అయిందన్నట్టుగా అమన్ కామెంట్ చేశారు. రకుల్ మార్నింగ్ అడిగినప్పుడు ఈ ప్యాన్ కేక్ తినను అని చెప్పడం ఎంతో మంచిది అయిందని ఈ వీడియోను పోస్ట్ చేసి అక్క పరువు తీసేశారు. రకుల్ ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అమన్ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ioT6UV
v
No comments:
Post a Comment