Monday, 12 April 2021

Vakeel Saab Collections: కొనసాగుతున్న వసూళ్ల వేట.. మూడు రోజుల్లో ఎంత రాబట్టారంటే!

రీ- ఎంట్రీ సక్సెస్ అయింది. మూడేళ్ళ విరామం తర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చిన పవర్ స్టార్.. బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ రాబడుతున్నారు. తొలి రోజే ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ కలెక్షన్ల ప్రవాహం పారిస్తోంది. ఓ వైపు ఏపీలో టికెట్స్ రేట్స్ ఇష్యూ నడుస్తున్నా కూడా ఆ ప్రభావం సినిమాపై పెద్దగా పడలేదని తాజా రిపోర్ట్స్ చూస్తుంటే అర్థమవుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల దిశగా పరుగులు పెడుతుండటం విశేషం. సోషల్ మెసేజ్‌తో కూడిన సందేశం, పవన్ కళ్యాణ్ యాక్టింగ్, అలాగే థమన్ అందించిన బాణీలు ఈ సినిమా విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఏప్రిల్ 9 (శుక్రవారం) విడుదలైన ఈ సినిమా తొలి రోజు 32.24 కోట్ల షేర్ వసూలు చేసి తదుపరి రెండు రోజుల్లోనూ ఇంచుమించుగా అదే రన్ కొనసాగించింది. మొత్తంగా ఈ వీక్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా చూస్తే 90 కోట్ల గ్రాస్, రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి. మూడో రోజుకు గాను తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ రిపోర్ట్ చూస్తే.. నైజాం: 3.90Cr సీడెడ్: 1.85Cr ఉత్తరాంధ్ర: 1.71Cr ఈస్ట్ గోదావరి: 71L వెస్ట్ గోదావరి: 52L గుంటూరు: 61L కృష్ణా: 71L నెల్లూరు: 38L మొత్తంగా చూస్తే 10.43CR నెట్, 17.7Cr గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక వకీల్ సాబ్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 89.35కోట్ల రూపాయలు కాగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 90 కోట్లు. ఇప్పటివరకైతే మొత్తంగా 59.82 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. సో.. ఆ టార్గెట్‌ను రీచ్ లావాలంటే మరో 30.18కోట్ల షేర్ రాబట్టాలి మరి. అయితే అది అంత పెద్ద మ్యాటరేం కాదని ప్రస్తుతం వకీల్ సాబ్ రన్ తెలుపుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3s6CIcJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...