Tuesday, 13 April 2021

Ntr 30: బ్లాక్ బస్టర్ కాంబోలో హీరోయిన్ ఫిక్స్.. యంగ్ టైగర్ కోరిక మేరకు ఆమెనే ఫైనల్!

జక్కన్న దర్శకత్వంలో RRR సినిమాతో బిజీగా ఉన్న యంగ్ టైగర్ తన తదుపరి సినిమాను డైరెక్టర్ కొరటాల శివతో కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్‌తో ఉంటుందని కొన్ని నెలల క్రితం ప్రకటన వచ్చింది కానీ అనూహ్యంగా కొరటాల సినిమా తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ 30వ సినిమాగా డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుందని అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సూపర్ డూపర్ హిట్ అయింది. మరోసారి ఈ కాంబో రిపీట్ కాబోతుందని వచ్చిన ఈ ప్రకటనతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై అందరి కళ్లు పడ్డాయి. ఎన్టీఆర్‌తో జోడీ కట్టాలంటే అందం, అభిమయం అందుకు తోడు ఇరగదీసే స్టెప్పులేసే సత్తా ఉండాలి. కాబట్టి హీరోయిన్ విషయంలో చాలామంది పేర్లు పరిశీలిస్తున్నారట కొరటాల. ఈ క్రమంలో బాలీవుడ్ బ్యూటీ అయితే బెటర్ అని కొరటాలకు ఎన్టీఆర్ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై పాజిటివ్‌గా రియాక్ట్ అయిన కొరటాల శివ వెంటనే ఓకే చెప్పి కియారాతో సంప్రదింపుల కార్యక్రమాలు మొదలుపెట్టేశారని సమాచారం. ఇప్పటికే కొరటాల శివతో పని చేసిన అనుభవం కియారా అద్వానీకి ఉంది. మహేష్ బాబు హీరోగా వచ్చిన 'భరత్ అనే నేను' సినిమాతో కియారను టాలీవుడ్‌కి కొరటాలే పరిచయం చేశారు. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా కొరటాల సినిమా ఒప్పుకోవాలని, డేట్స్ సర్దుబాటు చేసుకుంటోందట కియారా అద్వానీ. 'ఎన్టీఆర్‌కొరటాల2'గా ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఏప్రిల్ 29వ తేదీ 2022న ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3a99uUp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...