Thursday, 15 April 2021

Jr. Ntr: అమాయక చక్రవర్తి ఎన్టీఆర్.. స్కెచ్ మార్చేసిన కొరటాల!! ఇదీ లేటెస్ట్ టాక్

వెండితెరపై యంగ్ టైగర్ దూకుడు ఏ రేంజ్‌లో ఉంటుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో స్ట్రాంగ్ డైలాగ్ డెలివరీతో థియేటర్లలో ప్రేక్షకుల చేత గోల పెట్టించడం ఎన్టీఆర్ స్టైల్. అలాంటి యంగ్ టైగర్‌ని అమాయక చక్రవర్తి చేసేస్తున్నారట డైరెక్టర్ . ప్రస్తుతం ఈ విషయం జనాల్లో హాట్ టాపిక్ అయింది. అదేనండీ.. RRR మూవీ తర్వాత ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే కదా!. ఇటీవలే ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేసేశారు. అయితే తాజాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ విషయమై ఓ ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ అమాయక చక్రవర్తిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. సామాజిక కోణాల్లో సినిమాలు తీస్తూ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో తనదంటూ ప్రత్యేక శైలి అని నిరూపించుకున్న కొరటాల.. ఈ సినిమా కోసం డిఫరెంట్ స్కెచ్ వేశారట. పల్లెటూరిలో అమాయకంగా తిరిగే ఓ వ్యక్తి ఒకానొక సందర్భంలో సిటీకి వెళ్లాల్సి రావడం.. అక్కడ అతను ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల అప్పటి నుంచి ఆయన ఎలా మారతాడు? అనే పాయింట్ తీసుకొని ఎన్టీఆర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారట కొరటాల. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన 'జనతా గ్యారేజ్' మూవీ నందమూరి అభిమానులకు స్పెషల్ కిక్కిచ్చింది. దీంతో మరోసారి ఈ కాంబో మూవీ రానుండటం జనాల్లో ఆసక్తి పెంచేసింది. ఇకపోతే ఈ సినిమాలో కియారా అద్వానీని హీరోయిన్‌గా తీసుకున్నారని తెలుస్తోంది. అతి త్వరలో చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనుంది చిత్రయూనిట్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uXbbwu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...