Saturday, 10 April 2021

‘వకీల్‌సాబ్‌‌’కి చుక్కెదురు.. టికెట్ల విషయంలో షాక్ ఇచ్చిన డివిజన్ బెంచ్.. ఆ అవకాశం రెండు రోజులే..

వేణుశ్రీరామ్ దర్శకత్వంలో పవన్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం . శుక్రవారం (ఏప్రిల్ 9న) విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌ టాక్ సొంతం చేసుకుంది. రాజకీయాల కోసం మూడు సంవత్సరాల పాటు సినిమాలకు దూరమైన ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానుల సంబరాలు అంబరాలు తాకాయి. పైగా సినిమా కూడా బ్లాక్‌బస్టర్ కావడంతో ఇక సెలబ్రేషన్స్ పీక్స్‌కి చేరాయి. సాధారణంగా పెద్ద హీరోల సినిమా విడుదల అవుతుందంటే.. టికెట్ల రేట్లు, షోలు పెంచడం సర్వసాధారణంగా జరుగుతోంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వకీల్ సాబ్ టికెట్ రేట్ల హైక్‌కు, బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో మేకర్స్ ఏపీ కోర్టును ఆశ్రయించారు. వీరి పిటీషన్‌పై విచారణ చేపట్టన సింగిల్ జడ్జి.. టికెట్ల పెంపుదలకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశఆరు. అయితే ఏపీ సర్కార్ సింగిల్ జడ్జి ఆదేశాలపై హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఆదేశాలను సస్పెండ్ చేసింది. మొదటి రెండు రోజులు మాత్రమే టికెట్ రేట్లు పెంచుకొనే అవకాశం ఉందని.. ఆదివారం (ఏప్రిల్ 11) నుంచి టికెట్ల పెంపు వద్దని ఆదేశించింది. హిందీలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ‘పింక్’ సినిమా రీమేక్‌గా ‘వకీల్‌సాబ్’ తెరకెక్కింది. ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్ రాజ్‌లు ప్రధాన పాత్రల్లో నటించగా.. శృతి హాసన్ హీరోయిన్‌గా చేసింది. బోణి కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PQFR3r
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...