Monday, 12 April 2021

ఆ వార్తలు నమ్మకండి.. ‘వకీల్‌సాబ్’ గురించి వస్తున్న రూమర్లపై స్పష్టత ఇచ్చిన నిర్మాణ సంస్థ

రాజకీయాల కోసం సినిమాలకు దూరమైన పవర్‌స్టార్ రీఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘వకీల్‌సాబ్’. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్ ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో నటించారు. హిందీలో అద్భుత విజయం సాధించిన ‘పింక్’ సినిమా రీమేక్‌గా ఈ సినిమాని రూపొందించారు. అయితే ఇంకొన్ని రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలో రాబోతుందని సోషల్‌మీడియా పుకార్లు ప్రారంభం అయ్యాయి. ఈ పుకార్లకు సినిమా నిర్మాణ సంస్థ చెక్ పెట్టింది. ‘వకీల్‌సాబ్‌’ను ఓటీటీలో విడుదల చేసే ఆలోచన ఇప్పట్లో లేదని శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ స్పష్టం చేసింది. ‘‘సినిమాపై వస్తున్న వార్తలు పట్టించుకోకండి. దయచేసి వకీల్‌సాబ్‌ను థియేటర్లలో చూడండి. ప్రస్తుతానికి సినిమాను ఏ ఓటీటీలో విడుదల చేసే ఆలోచన లేదు’’ అంటూ ట్వీట్ చేసింది. ఇక బోణి కపూర్ సమర్పణలో దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్ రాజ్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు. గత శుక్రవారం(ఏప్రిల్ 9న) విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతూ.. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల దిశగా పరుగులు పెడుతుండటం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wXIlxR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...