Tuesday, 13 April 2021

టీజర్: కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.. బాలయ్య ‘అఖండ’ విశ్వరూపం

అసలే బోయపాటి.. ఆపై బాలయ్యతో మూవీ.. అందులోనూ మూడో సినిమా అంటే ఔట్ పుట్ ఈ రేంజ్‌లో ఉంటుంది మరి. నందమూరి అభిమానులకు ఉగాది పండుగరోజున అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. బోయపాటి శ్రీను సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా BB3 టైటిల్ అనౌన్స్‌తో పాటు నిమిషం నిడివితో టీజర్‌ను విడుదల చేశారు. హరహర మహాదేవ.. శంభోశంకర అంటూ త్రిశూలం పట్టుకుని ఒంటి నిండా శంకరుడి పచ్చబొట్టు పొడిపించుకుని శివుడిలా మూడో కన్ను తెరిస్తూ ఉగ్రరూపం దాల్చాడు బాలయ్య. కాలుదువ్వే నంది ముందు రంగు మార్చే పంది.. కారు కూతల కూస్తే కపాలం పగిలిపోద్ది అంటూ బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ చెప్తూ.. విలన్లను బంతుల్లా ఎగరేస్తున్నాడు.. బ్యాగ్రౌండ్‌లో తమన్ వేసిన దరువు ‘అఖండ’.. విజయం సాధించేట్టుగానే కనిపిస్తుంది. బోయపాటి మార్క్ డైరెక్షన్‌కి బాలయ్య బాబు విశ్వరూపం తోడైతే ఎలా ఉంటుందో టీజర్‌లోనే హింట్ ఇచ్చారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి తమన్‌ సంగీత స్వరాలు సమకూర్చగా.. హీరో శ్రీకాంత్ఈ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. సమ్మర్ కానుకగా మే 28 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ti2hcc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...