ఏం నాయనా.. ఉన్న ఒక్క భార్యా చాలడం లేదా?? మళ్లీ ఇంకో భార్యనా?? ఇప్పటికే తమ్ముడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని ఆడిపోసుకుంటున్నారు.. ఇప్పుడు అది చాలదన్నట్టు అన్నయ్య కూడా సిద్ధమయ్యాడా? అంటే.. మెగా బ్రదర్ మోజు పడుతున్నారు. కూతురు కొడుకుకి పెళ్లి చేసి మనవల్లుతో ఆడుకునే వయసులో ఇదేం సరదా అంటే ఆయన ఇన్ స్టాగ్రామ్ లైవ్ ముచ్చట్లలోకి వెళ్లాల్సిందే. ఇటీవల నెటిజన్లతో జరిపిన లైవ్ చాట్‌లో తన రెండో పెళ్లి ముచ్చట గురించి ఓపెన్ అయ్యారు నాగబాబు.. ‘ఏం సార్.. మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా?’ అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘ఈ వయసులో నాకు పెళ్లా..? అయినా మీరంతా ఓకే అంటే నాకూ ఓకే’ అంటూ సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో రెండో పెళ్లి వార్త హాట్ టాపిక్ అయ్యింది. అయితే మళ్లీ ఇదే విషయంపై మాట్లాడారు నాగబాబు.. తాజాగా అభిమానులతో జరిపిన ఇన్ స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో ‘మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదు సార్’ అని అడగ్గా.. ‘మా ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు.. ఆ ఆలోచన వచ్చినా పీక కోస్తా అని ప్రేమగా చెప్పింది.. అంత ప్రేమగా చెప్పాక నేను మాత్రం రెండో పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తాను’ అంటూ చమత్కారం ప్రదర్శించారు నాగబాబు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3a9ehFt
v
No comments:
Post a Comment