Sunday, 11 April 2021

‘మేజర్’ టీజర్ చూసిన ‘టక్‌ జగదీశ్’.. నేను చూసిన వాటిలో ఇదే బెస్ట్ అంటూ ప్రశంస..

‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘మేజర్’. 26/11 ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఉన్నికృష్ణన్ జీవితగాధ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. మేజర్ ఉన్నికృష్ణన్ శౌర్యం, వీరత్వం గురించే కాకుండా.. ఆయన జీవితానికి సంబంధించిన పలు కీలక ఘట్టాలను ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ పాన్ ఇండియా మూవీగా మూడు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా టీజర్‌ని మూడు స్టార్ హీరోలతో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. తెలుగులో సూపర్‌స్టార్ మహేశ్ బాబు టీజర్‌ని విడుదల చేస్తుండగా.. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, హిందీలో సల్మాన్ ఖాన్ టీజర్‌ని విడుదల చేస్తున్నట్లు అడివి శేష్ ప్రకటించాడు. సోమవారం(ఏప్రిల్ 12న) సాయంత్రం 4.05 గంటలకు ఈ టీజర్ విడుదల కానుంది. అయితే ఈ టీజర్‌పై న్యాచురల్ స్టార్ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘నేను మేజర్ సినిమా టీజర్ చూశాను. ఈ మధ్యకాలంలో నేను చూసిన టీజర్లన్నింటిలోనూ ఇది బెస్ట్’ అంటూ నాని ట్వీట్ చేశాడు. దీనిపై అడివి శేష్ స్పందించాడు. ‘లవ్ యూ బ్రదర్’ అంటూ అతను రిప్లే ఇచ్చాడు. త్వరలో నాని, అడివి శేష్ కాంబినేషన్‌లో ఓ సినిమా రానుంది. విశ్వక్‌సేన్ హీరోగా నటించిన థ్రిలర్ సినిమా ‘హిట్’ సీక్వెల్‌లో ‘హిట్-2’లో అడివి శేష్ హీరోగా నటిస్తుండగా.. నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. కాగా, శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్ల‌స్ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో శోభితా ధూళిపాల, సైయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో ఈ ఏడాది జూలై 2న విడుదల చేయనున్నారు. ఇక నాని ‘టక్‌ జగదీశ్’గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రితూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఐశ్వర్య రాజేశ్, జగపతి బాబు, రావు రమేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఏప్రిల్ 23న విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/326hyBa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...