Wednesday, 10 March 2021

Prabhas: రాధే శ్యామ్ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్.. రొమాంటిక్ మూడ్‌లో ప్రభాస్, పూజా హెగ్డే

రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ''. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో హీరోగా రూపొందుతున్న ఈ సినిమా చాలా రోజుల పాటు షూటింగ్ జరుపుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. 1960 దశకం నాటి వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. జులై 30వ తేదీన భారీ ఎత్తున్న ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ కూడా అంతే భారీ రేంజ్‌లో చేస్తున్న చిత్రయూనిట్.. తాజాగా ప్రేక్షకులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే మంచులో వ్యతిరేక దిశల్లో పడుకుని కనిపిస్తున్నారు. ఇద్దరూ ఆకాశం వైపు చూస్తూ రొమాంటిక్ మూడ్‌లో కనిపిస్తున్న ఈ పోస్టర్ చాలా డిఫరెంట్‌గా ఉండటంతో అంతా ఆకర్షితులవుతున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఐదు భాషల్లో ఈ మూవీ రానున్న నేపథ్యంలో అన్ని భాషల్లో ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. షూటింగ్ పరంగా కాస్త ఆలస్యం చేసినా కొన్నిరోజులుగా సర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్ ఇస్తూ ఆకట్టుకుంటోంది 'రాధే శ్యామ్' యూనిట్. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై రూపొందుతున్న ఈ భారీ సినిమాలో భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, ఎయిర్‌టెల్‌ భామ శాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ప్రభాస్ ప్యూర్ రొమాంటిక్ రోల్‌‌లో కనిపించబోతుండటం విశేషం. ఏదేమైనా వింటేజ్‌ ప్రేమకథా చిత్రంపై జనాల్లో మాత్రం ఓ రేంజ్ అంచనాలున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3l4DzJ0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...