Saturday, 13 March 2021

ఎవరు మీలో కోటీశ్వరులు: ఆట నాది.. కోటి మీది అంటూ బరిలోకి ఎన్టీఆర్.. బిగ్ బాస్‌ని మించి ఎమోషన్స్

రాను రాను బుల్లితెర ప్రోగ్రామ్స్ హవా బాగా పెరిగి పోతోంది. సరికొత్తగా డిజైన్ చేస్తూ సిల్వర్ స్క్రీన్ హీరోలను హోస్టులుగా పెట్టి ఇంట్లోనే వినోదం పంచుతున్నారు ప్రోగ్రాం నిర్వాహకులు. ఈ నేపథ్యంలోనే అన్ని భాషల్లో టీవీ షోస్ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ షో భారీ టీఆర్ఫీతో దూసుకుపోతుండగా.. దానికి ధీటుగా పలు ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా 'రండి గెలుద్దాం... ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' అంటూ బరిలోకి దిగుతున్నారు యంగ్ టైగర్ . నిజానికి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో స్టార్ మా ఛానల్‌లో ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు జెమినీ టీవీలో ప్రసారం కాబోతోంది. దీనికి ‘' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ షో ప్రోమో వీడియో రిలీజ్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది. ఎన్టీఆర్ మాటల తూటాలు బుల్లితెర ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రోమో వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ కోరమీసంతో యమ స్టైలిష్‌గా కనిపించడమే గాక.. ‘ఈ ఆట గురించి నా కంటే మీకే బాగా తెలుసు' అంటూ గంభీరమైన గొంతు, తనదైన మాటతీరుతో అట్రాక్ట్ చేశారు. 'ఇక్కడ కథ మీది.. కల మీది.. ఆట నాది.. కోటి మీది' అంటూ ఎన్టీఆర్ చెప్పిన విషయాలు ఇప్పటికే షో పట్ల ఉన్న ఆసక్తికి రెక్కలు కట్టాయి. ఇక చివరగా 'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు.. ఇట్లు ప్రేమతో మీ రామారావు' అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ బుల్లితెర ఆడియన్స్‌ను, నందమూరి అభిమానులను హుషారెత్తించింది. గ‌తంలో ఎన్టీఆర్‌ బిగ్ బాస్ సీజ‌న్- 1కి ఎన్టీఆర్ హోస్ట్ చేసి ఆకట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' చిన్నితెరపైకి వస్తుండటం పట్ల అంతా ఖుషీ అవుతున్నారు. కాగా, కొద్దిసేపటి క్రితం జరిగిన ఈ షో ప్రెస్ మీట్‌లో.. బిగ్ బాస్ తర్వాత ప్రజలతో మమేకమవడనికి ఇదో కొత్త జర్నీ అన్నారు ఎన్టీఆర్. బిగ్ బాస్ కన్నా ఇక్కడ ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయని ఆయన పేర్కొనడం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38yvrvo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...