Thursday, 11 March 2021

‘ఏక్ మినీ కథ’ టీజర్: అది చిన్నదైతే మాత్రం ప్రాబ్లం పెద్దదే బ్రో!

యూవీ క్రియేష‌న్స్ అంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యుత్తమ నాణ్యతతో, విలువలతో సినిమాలను నిర్మించే సంస్థ. ‘మిర్చి’ నుండి ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ వ‌ర‌కూ ద‌ర్శకుడు చెప్పిన క‌థ‌ని న‌మ్మి మార్కెట్‌‌తో ఏమాత్రం సంబంధం లేకుండా గొప్పగా సినిమాలు తెర‌కెక్కిస్తున్నారు. కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త దర్శకుడిని తీసుకొస్తున్నారు. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌కి అనుభంద సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యాన‌ర్‌ని స్థాపించి, మ‌రో నిర్మాణ సంస్థ మ్యాంగో మాస్ మీడియాతో క‌లిసి ప్రేక్షకుడి వినోదాన్ని డబుల్ చేయబోతున్నారు. ఈ కొత్త బ్యాన‌ర్‌లో మొద‌టి చిత్రంగా ‘ఏక్ మినీ క‌థ’ని తెర‌కెక్కించారు. ‘మిర్చి’ లాంటి బ్లాక్‌బ‌స్టర్ త‌రువాత సుజీత్‌ని ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం చేస్తూ ‘ర‌న్ రాజా ర‌న్’, రాధాకృష్ణని ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం చేస్తూ ‘జిల్’ చిత్రాలు నిర్మించింది యూవీ క్రియేష‌న్స్‌. ఇప్పుడు ‘ఏక్ మినీ క‌థ’ చిత్రంతో కార్తీక్ రాపోలు ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ‘ఏక్ మినీ కథ’ చిత్ర ఫస్ట్ లుక్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ‘Does Size Matter’ అంటూ పోస్టర్‌లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ‘ఏక్ మినీ క‌థ’ టీజ‌ర్ కూడా ఆకట్టుకుంటోంది. సంతోష్ శోభన్ టైమింగ్ ప్రముఖ ద‌ర్శకుడు శోభ‌న్ కుమారుడు సంతోష్ శోభన్ ‘పేప‌ర్ బాయ్’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. న‌టుడిగా ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకున్నారు. ఇప్పుడు ‘ఏక్ మినీ క‌థ’ చిత్రంలో డిఫ‌రెంట్ క‌థతో ప్రేక్షకుల్ని న‌వ్విండానికి సిద్ధమ‌య్యారనే విష‌యం టీజ‌ర్ చూసిన వారికి అర్థమవుతుంది. ‘‘అది చిన్నదైతే మాత్రం ప్రాబ్లం పెద్దదే బ్రో’’ అనే డైలాగ్‌తో సినిమాపై ఆసక్తిని పెంచారు. మేర్లపాక గాంధీ - యూవీ కాంబినేష‌న్‌ యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమా చేసిన ర‌చ‌యిత‌, ద‌ర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి క‌థ‌ని అందించారు. ‘వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రాల‌తో మేర్లపాక గాంధీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ ‘ఏక్ మినీ క‌థ’కి క‌థ‌ అందించడమే కాకుండా కొత్త ద‌ర్శకుడు కార్తీక్ రాపోలుకి త‌న సపోర్ట్ అందిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం మసకూరుస్తు్న్న ఈ చిత్రానికి గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సంతోష్ శోభన్ సరసన కావ్య త‌ప్పర్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో శ్రద్ధాదాస్‌, బ్రహ్మజి, స‌ప్తగిరి, సుద‌ర్శన్‌, పోసాని కృష్ణముర‌ళి, జ‌బ‌ర్దస్త అప్పారావు, రూప లక్ష్మి, జెమిని సురేష్‌, ప్రభు ముఖ్య పాత్రలు పోషించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30Axive
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...