Saturday 27 March 2021

జనసేన-బీజేపీ అభ్యర్థి కత్తి రత్నప్రభ‌తో కత్తి మహేష్ భేటీ.. ఒకే కులం, ఒకే ఇంటిపేరు అయినా సరే ట్విస్ట్ మామూలుగా లేదు!

పవన్ కళ్యాణ్ పేరు చెబితే కత్తి మహేష్ కస్సున లేస్తుంటాడు. ఎటు నుంచి ఎటు తీసుకుని వచ్చైనా సరే.. పవన్ కళ్యాణ్‌పై కత్తి దూయడంతో జనసైనికుల ఆగ్రహాన్ని చవిచూసే కత్తి మహేష్ జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కత్తి రత్నప్రభ‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కత్తి మహేష్ ఏంటి?? జనసేన అభ్యర్థితో భేటీ కావడం ఏంటి? అంటే ఇప్పుడు రాజకీయాలన్నీ కుల సమీకరణ నేపథ్యంలోనే నడుస్తుండగా.. ఈ భేటీ కూడా అలాంటిదే. ఎస్సి రిజర్వుడు కావడంతో.. కులసమీకరణలో భాగంగా మాదిగ సామాజికవర్గానికి చెందిన ఐఏఎస్ అధికారిణి రత్నప్రభను జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి బరిలో దించారు. తిరుపతిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి, తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మి ఇద్దరూ మాల సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు కాగా.. రత్నప్రభ మాదిక సామాజిక వర్గం కావడంతో అదే సామాజిక వర్గం.. అదే ఇంటి పేరు కలిగిన కత్తి మహేష్.. కత్తి రత్నప్రభ‌తో భేటీ అయ్యారు. కత్తి మహేష్ ఒక్కరే కాదు కానీ.. చిత్తూరు జిల్లాకి చెందిన కొంతమంది మాదిగ నేతలతో భేటీ అయ్యారు కత్తి రత్నప్రభ‌. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు కత్తి మహేష్. కత్తి రత్నప్రభ గారు నిబద్ధత కలిగిన ఐఏఎస్ అధికారిణిగా రాణించారు. దళితజాతికి ఎంతో సేవచేసిన కత్తి చంద్రయ్యగారి వారసురాలు. జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి బరిలో దిగడం వ్యక్తిగతంగా నాకు ఆనందాన్ని కలిగించే విషయం అని చెప్పిన కత్తి మహేష్ తాజా పోస్ట్‌లో మరో ట్విస్ట్ ఇచ్చారు. ‘చిత్తూరు జిల్లాలో మాదిగ నాయకత్వం లేదు. మాదిగలలో ఐకమత్యం లేదు. ఆర్ధిక వనరులు అంతకన్నా లేవు. స్థానికి మాలలతో పాటు తమిళమాలలు అక్కడ బలమైన వాయిస్ ఉన్న కమ్యూనిటీ. చాలా ఎన్జీవోలు కూడా వాళ్లే రన్ చేసేవాళ్ళు. కాబట్టి, పబ్లిక్ లైఫ్ లో వాళ్లే కనిపిస్తారు. వినిపిస్తారు. అందుకే అన్ని రాజకీయ పార్టీలు మాలలకే ప్రాధాన్యత ఇస్తారు. పర్సెంటేజీ పరంగా మాల-మాదిగల నిష్పత్తికి తేడా 3% మించకపోయినా, మాలలే ఎక్కువ శాతం ఉన్నారు అనే నమ్మకం రాజకీయ వర్గాలలో బలంగా ఉంది. అంతమాత్రం చేత ఓడిపోయే సీటులో బీజేపీ లాంటి దళిత వ్యతిరేక పార్టీ నిలబెట్టిన స్థానికేతర మాదిగ మాజీ ఐఏఎస్ అధికారిణికి ఓటు వెయ్యాలి అనే వాదనలో చాలా లోపం ఉంది. చిత్తూరు జిల్లాకి సంభందించిన మాదిగగా నా దృక్కోణం దీనికి వ్యతిరేకం. కేవలం మాదిగలకు రెప్రజెంటేషన్ ఉండాలి కాబట్టి, మొత్తంగా దళితులకే అన్యాయం చేసే బీజేపీకి ఓటెయ్యడం... నా మనసుకినప్పదు’ అంటూ చివర్లో ట్విస్ట్ ఇచ్చారు కత్తి మహేష్. సో.. భేటీ వరకూ ఓకే కానీ.. ఓటు మాత్రం వేయడం కుదరదని చెప్పకనే చెప్పారు కత్తి మహేష్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lXZ1zX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...