Friday 29 January 2021

వేసవిలో వస్తోన్న ‘నారప్ప’.. విడుదల తేదీ ఖరారు

విక్టరీ చాలా కాలం తరవాత చేస్తున్న పక్కా మాస్ ఎంటర్‌టైనర్ ‘నారప్ప’. గతంలో వెంకటేష్‌తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రానికి పనిచేసిన శ్రీకాంత్ అడ్డాల ‘నారప్ప’కు దర్శకత్వం వహిస్తున్నారు. సురుష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వి క్రియేషన్స్ బ్యానర్లపై డి.సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్నారు. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటి నుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో సుందరమ్మగా గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థలు ఖరారు చేశాయి. మే 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ మేరకు రిలీజ్ డేట్ పోస్టర్లను విడుదల చేశాయి. గతంలో విడుదల చేసిన వెంకటేష్ నారప్ప లుక్‌నే ఈ పోస్టర్లలో వాడారు. మొత్తానికి ఈ వేసవిలో ‘నారప్ప’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’కు ‘నారప్ప’ రీమేక్ అన్న విషయం తెలిసిందే. తమిళంలో ధనుష్ పోషించిన పాత్రను వెంకటేష్ చేస్తుండగా.. మంజు వారియర్ చేసిన పాత్రలో ప్రియమణి నటిస్తున్నారు. వెంకటేష్ పెద్ద కుమారుడి పాత్రను ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కార్తీక్ రత్నం పోషిస్తున్నారు. కాగా, ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుద‌లైన గ్లింప్స్, పోస్టర్లకు మంచి స్పంద‌న వ‌చ్చింది. అలాగే, సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియ‌జేస్తూ కొత్త పోస్టర్‌ విడుద‌ల చేశారు. వెంకటేష్, ప్రియ‌మ‌ణి సహా ఫ్యామిలీ అంతా ఉన్న ఈ పోస్టర్ ఆక‌ట్టుకుంది. ఇక, ‘నారప్ప’ టీజర్ కోసం వెంకటేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ఇంకా కార్తిక్ ర‌త్నం, రావు ర‌మేష్‌, రాజీవ్ క‌న‌కాల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్. పీటర్ హెయిన్, విజయ్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంత శ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం సాహిత్యం అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iXkoQi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...