Thursday 31 December 2020

ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత

సీనియర్ నటుడు కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో సోమాజీగూడ యశోద హాస్పిటల్‌లో చేరిన నర్సింగ్ యాదవ్.. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. నర్సింగ్ యాదవ్ గత ఏడాది కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఆయనకు సోమాజీగూడ యశోద హాస్పిటల్‌లోనే డయాలసిస్ చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న నర్సింగ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచీ ఆయన కోమాలోనే ఉన్నట్టు సమాచారం. అంతేకాదు, అప్పటి నుంచీ ఆయన యశోద హాస్పిటల్‌లో కిడ్నీ సమస్యకు చికిత్స పొందుతున్నారు. కానీ, దాన్ని జయించలేకపోయారు. ఇదిలా ఉంటే, నర్సింగ్ యాదవ్ గత 25 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నారు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్రవేశారు. రామ్ గోపాల్ వర్మ చిత్రాలతో నర్సింగ్ యాదవ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ‘క్షణం క్షణం’లో ఆయన చేసిన నర్సింగ్ పాత్ర ఆయనకు పాపులారిటీ తెచ్చిపెట్టింది. నర్సింగ్‌ను చిరంజీవి కూడా బాగా ప్రోత్సహించారు. చిరంజీవితో పాటు చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో నర్సింగ్ నటించారు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ తన పాత్రలకు ప్రత్యేకత తీసుకొచ్చారు నర్సింగ్. ‘మాస్టర్’, ‘చంద్రలేఖ’, ‘ఇడియట్’, ‘జానీ’, ‘ఠాగూర్’, ‘వర్షం’, ‘సై’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘మాస్’, ‘అడవి రాముడు’, ‘డార్లింగ్’ ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో ఆయన నటించారు. చివరిగా ‘ఖైదీ నెం. 150’లో కనిపించారు. 400కు పైగా సినిమాల్లో నర్సింగ్ యాదవ్ నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34XNOIt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...