Saturday 31 October 2020

Jawaharlal Nehru: నెహ్రూ బలహీనుడంటూ దుమారం రేపిన కంగనా రనౌత్.. మహాత్మా గాంధీపై సంచలన వ్యాఖ్యలు

బాలీవు‌డ్‌లో నెపోటిజం, డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోందంటూ సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫైర్ బ్రాండ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ఈ సారి ఏకంగా జాతిపిత , భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూలపై తనదైన కోణంలో కామెంట్స్ చేసి సంచలనం సృష్టించింది. ఈ రోజు (అక్టోబర్ 31) సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ మరో కాంట్రవర్సీకి తెరలేపింది. వల్లభాయ్ పటేల్‌ని పొగుడుతూనే గాంధీ, నెహ్రూలపై విరుచుకుపడింది. భారత ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్‌కు జయంతి సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు అని తెలుపుతూ ట్వీట్ పెట్టిన కంగనా.. మాకు ఈ అఖండ భారత దేశాన్ని అందించిన మాహానుభావులు మీరు అని కొనియాడింది. మీ నాయకత్వంలో విడిపోయి ఉన్న 562 సంస్థానాలను ఏకం చేసి, అఖండ భారత దేశాన్ని నిర్మించడంతో పాటు దేశ ప్రజలకు స్వతంత్ర భారత దేశాన్ని అందించి ఎందరికో ఆదర్శంగా నిలిచారని పేర్కొంది. భారత్‌కు తొలి ప్రధాని అయ్యే అవకాశం మీదే అయినప్పటికీ.. బలహీనుడైన నెహ్రూకు ఆ పదవిని త్యాగం చేసిన మహా మనిషి మీరు అని తెలిపింది. పటేల్ ఒక నిజమైన ఉక్కు మనిషని కితాబునిచ్చింది. Also Read: ఇకపోతే గాంధీ గురించి పేర్కొంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది కంగనా రనౌత్. పటేల్ లాంటి ఉక్కు మనిషిని వదిలిపెట్టి నెహ్రూ లాంటి బలహీన మనస్తత్వం ఉన్న వ్యక్తిని గాంధీ కావాలనే తొలి ప్రధానిగా ఎంచుకున్నారని వ్యాఖ్యానించింది. నెహ్రూను ముందుంచి దేశాన్ని తను నడిపించాలనేది మంచి ప్రణాళిక అనుకున్నా కూడా గాంధీ మరణం తర్వాత దేశ పరిస్థితి అధ్వాన్నంగా తయారైందంటూ అగ్గి రాజేసింది కంగనా. నెహ్రూ ఇంగ్లిష్ బాగా మాట్లాడగలడని గాంధీ నమ్మకమని, అయితే ఈ నిర్ణయం వల్ల వల్లభాయ్ పటేల్ బాధపడలేదు.. కానీ, కొన్ని దశాబ్దాల పాటు దేశం మాత్రం ఇబ్బందులు ఎదుర్కొందని పేర్కొంటూ కంగన వరుస ట్వీట్స్ చేసింది. దీంతో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35OKe2V
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...