Monday 31 August 2020

Radhe Shyam: లాంగ్ గ్యాప్ తర్వాత ఇటలీ బయల్దేరుతున్న ప్రభాస్ అండ్ టీమ్.. రిస్క్ చేసేందుకు రెడీ!

యంగ్ రెబల్ స్టార్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఫారిన్ ట్రిప్ వేయనున్నారని తెలుస్తోంది. ఆయన లేటెస్ట్ మూవీ ‘’ షూటింగ్ తదుపరి షెడ్యూల్ కోసం ప్రభాస్ అండ్ టీమ్ అతిత్వరలో ఇటలీ బయల్దేరబోతోందని సమాచారం. గతంలో కూడా కరోనా కారణంగా షూటింగ్స్ వాయిదా పడిన సమయంలో ఫారిన్ షూట్‌లో ఉండి చివరగా షూటింగ్ వాయిదా వేసుకున్న ఈ చిత్ర యూనిట్ మరోసారి రిస్క్ చేయడానికి రెడీ అయిందని టాక్. 1960 దశకం నాటి ప్రేమకథతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’రూపొందుతోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఇటీవలే రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించిన చిత్రయూనిట్.. ఇక త్వరత్వరగా షూటింగ్ ఫినిష్ చేసేందుకు ప్లాన్స్ చేస్తోందట. ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం ఫారిన్ లొకేషన్స్‌లో షూట్ చేయాల్సి ఉండటంతో మరికొద్ది రోజుల్లో ఇటలీ షూట్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. యూరప్‌లో టూరిజం విషయంలో నిబంధనలను సడలిస్తుండడంతో దీనిని సద్వినియోగం చేసుకునేలా సన్నాహాలు ప్రారంభించారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ రెండోవారంలో ఫ్లైట్ ఎక్కాలని డిసైడ్ అయ్యారట. Also Read: మరోవైపు గత నాలుగు నెలలకు పైగా షూటింగ్స్ వాయిదా పడటం, విదేశాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తుండటం కారణంగా ఇక విదేశీ షూటింగ్స్ కుదరవని భావించి ఇప్పటికే ఈ మూవీ కోసం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేసి షూటింగ్ చేయాలని ఫిక్సయ్యారు. ఇందుకోసం దాదాపు 6 కోట్లు ఖర్చు చేశారట. దీంతో తదుపరి షెడ్యూల్ ఇక్కడే ఫినిష్ చేస్తారా? లేక ఇటలీ వెళ్తారా? అనేది సందేహంగా మారింది. అయినా ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ విదేశీ ప్రయాణం అనేది పెద్ద రిస్క్ అనే చెప్పుకోవాలి. ప్ర‌భాస్ 20వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ రాధే శ్యామ్ సినిమాలో ఆయన సరసన అందాల తార పూజా హెగ్డే ఆడిపాడుతోంది. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రంలో ప్రభాస్ ప్యూర్ రొమాంటిక్ రోల్ చేస్తున్నారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ddv114
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...