Sunday 30 August 2020

Ntv: ఎన్ టీవీ 13వ వార్షికోత్సవం.. పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ ప్రత్యేక శుభాకాంక్షలు

తెలుగు వార్తా ఛానళ్లలో తనదైన ముద్ర వేసుకున్న ఎన్ టీవీ విజయవంతంగా 13వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యానికి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు . ఛానెల్ సిబ్బందికి, సంస్థ అధినేత టీ. నరేంద్ర చౌదరి గారికి అభినందనలు తెలియజేస్తూ ఎన్ టీవీ మరెన్నో ప్రజాహిత వార్తా కథనాలు అందిస్తూ ప్రేక్షకాదరణ పొందాలని ఆకాంక్షించారు పవన్. ఇక పవన్ వీరాభిమాని ట్వీట్ చేస్తూ.. ''13 ఏళ్ళ క్రితం అడుగులు వేయడం ప్రారంభించిన మా ఎన్ టీవీ .. జర్నలిజం విలువలను ముందుకు తీసుకుని వెళుతూ మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆశిస్తూ. యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు'' అని పేర్కొన్నారు. జర్నలిజం అంటే ఒక బాధ్యత.. జర్నలిజం అంటే ఒక కట్టుబాటు.. జర్నలిజం అంటే కత్తిమీద సాము అన్న చైతన్యంతో ఎన్ టీవీ మొదలైంది. జనం వారి ప్రయోజనం జంట లక్ష్యాలుగా ప్రయాణం ప్రారంభించింది. వార్తలు చెప్పడంలో విలక్షణత చూపిస్తూ జనం గొంతుకగా నిలిచింది. లైవ్ వ్యాన్లతో వార్తా ప్రసారాల స్థాయిని పెంచుతూ అసలు లక్ష్యం ప్రజాహితమే అంటూ దూసుకు పోతోంది. ప్రతి వార్తకీ ప్రజలే కేంద్రం కావాలి. ప్రతి కార్యక్రమానికీ ప్రజాహితమే లక్ష్యం కావాలి. జనాకాంక్షకు ప్రతిక్షణం ఎన్టీవీ వేదిక కావాలి. జనాభిప్రాయానికి ఎన్టీవీ ప్రతిబింబం కావాలి అన్నట్లుగా యాజమాన్యం ముందుకు సాగుతోంది. మొదలైన దగ్గర నుంచి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడంలో ఎన్టీవీది ఒక ప్రత్యేకమైన ముద్ర. సర్వేల నిర్వహణలో, ఫలితాల ఖచ్చితత్వంలో ఎన్టీవీది ఒక బెంచ్ మార్క్. ఒక్కసారి తప్ప ఈ పదమూడేళ్ళలో ఎన్టీవీ సర్వేలు పొరబడిన సందర్భాలే లేవు. ఇప్పుడు ప్రతి ఎన్నకల ముందూ ఎన్టీవీ సర్వే అంటే పార్టీలకు ఒక లిట్మస్ టెస్ట్. ప్రజలకి ఒక చుక్కాని. ఎన్నికలకు ముందు ఏడాది నుంచే దశలు వారిగా సర్వేలు వెలువరించడం ఎన్టీవీకి ఆనవాయితీ. ఈ సర్వేలను చూసి వ్యూహాన్ని మార్చుకున్న పార్టీలు కూడా ఉన్నాయి. ట్రెండ్‌తో పాటు ట్రెడిషన్‌కి కూడా సమప్రాధాన్యమిస్తూ సాగుతోంది ఎన్టీవీ ప్రయాణం. సమాజానికి మార్గనిర్దేశనం చేసే ధార్మిక గురువుల ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రజలకు అందించే గురుతర బాధ్యతను నెత్తికెత్తుకుంది. సనాతన ధర్మ పరిరక్షణలో ఎన్టీవీ, భక్తి టీవీ పదేళ్లుగా కలసి అడుగులేస్తున్నాయి. ఏటా భక్తి టీవీ, ఎన్టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం దేశంలోనే అతి ముఖ్యమైన హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. అటు సోషల్ మీడియాలో కూడా శరవేగంగా దూసుకుపోతోంది ఎన్ టీవీ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gJ3mme
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...