Saturday 29 August 2020

ఇండియన్ స్టైల్ ఐకాన్ అల్లు అర్జున్.. వాటే ట్రెండ్ గురూ!

టాలీవుడ్‌లోని స్టార్ హీరోల అభిమానులకు ప్రస్తుతం ట్విట్టర్ ట్రెండ్‌లు ప్రామాణికంగా మారిపోయాయి. ప్రతి స్టార్ హీరో ఫ్యాన్స్ ఒక హ్యాష్‌ట్యాగ్‌తో తమ హీరోని ట్విట్టర్ టాప్ ట్రెండ్‌లో ఉంచుతున్నారు. శనివారం ట్విట్టర్ ట్రెండ్‌లో టాప్‌లో ఉన్నారు. #IndianStyleIconAlluArjun అనే హ్యాష్‌ట్యాగ్‌తో బన్నీ ఫ్యాన్స్ మిలియన్ల కొద్దీ ట్వీట్లు చేస్తూ తమ హీరోను టాప్ ట్రెండ్‌లో ఉంచారు. తమ హీరోకు సంబంధించిన ఏదో ఒక పోస్టు పెడుతూ దానికి ఈ హ్యాష్‌ట్యాగ్‌ను తగిలిస్తున్నారు. ‘ఇండియన్ స్టైల్ ఐకాన్ అల్లు అర్జున్’ అంటూ ట్రెండ్ సెట్ చేశారు. అయితే, బన్నీ అభిమానులకు అకస్మాత్తుగా ఈ ట్రెండ్ సెట్టింగ్ ఆలోచన రావడానికి కారణం ఉంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అల వైకుంఠపురములో’ టీఆర్‌పీ రేటింగ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డు‌ను నెలకొల్పింది. ఇటీవల టీవీలో ప్రసారమైన ‘అల వైకుంఠపురములో’ సినిమాకు 29.4 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. ఇంత వరకు ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో టీఆర్‌పీ రేటింగ్ రాలేదు. అంటే, ‘బాహుబలి 2’ రికార్డును కూడా ‘అల’ దాటేసింది. అందుకే, బన్నీ ఫ్యాన్స్ మంచి ఊపు మీద ఉన్నారు. ఇలా ట్విట్టర్‌లో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. కాగా, సంక్రాంతికి విడుద‌లైన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ వద్ద ‘నాన్ బాహుబ‌లి 2’ రికార్డులన్నింటినీ కొల్లగొట్టింది. మ్యూజిక్ పరంగా కూడా ‘అల వైకుంఠపురములో’ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుద‌లై 6 నెల‌లు కావోస్తుంది. ఇప్పటికే చాలా మంది ఓటీటీ ద్వారా ఈ సినిమాను చాలా సార్లు వీక్షించారు. అయినప్పటికీ, టీవీలో ప్రసారమైన ఈ సినిమాను బుల్లితెర ప్రేక్షకులు విపరీతంగా చూడటం విశేషం. కాగా, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్లపై అల్లు అర‌వింద్, కె.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. తమన్ సంగీతం సమకూర్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31DcR23
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...