Monday, 20 July 2020

Nayanthara marriage: నయనతార పెళ్లి ఏర్పాట్లు ముమ్మరం.. కేరళలోని ఆ ప్రదేశంలో! ఫైనల్‌గా ఫిక్సయ్యారలా..

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ పెళ్లి గురించిన వార్తలు గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచిలర్ అయిన ఈ 36 ఏళ్ళ బ్యూటీ అతి త్వరలో పెళ్లి పీటలెక్కనుందని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని, ప్రస్తుతం నయన్ కుటుంబ సభ్యులు అదే పనిలో నిమగ్నమై ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు కేరళలోని ఓ అమ్మవారి గుడిలో నయనతార పెళ్లి జరిపించాలని ఫిక్సయ్యారట. Also Read: కెరీర్ ప‌రంగా చాలా బిజీగా ఉంటున్న న‌య‌న‌తార వ్య‌క్తిగ‌త జీవితంలో ప్రేమ సంగతులే హైలైట్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కెరీర్ ఆరంభం లోనే హీరో శింబుతో ప్రేమాయణం కొనసాగించి బ్రేకప్ చెప్పిన నయన్.. ఆ తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో చెట్టాపట్టాలేసుకు తిరిగింది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంతా ఫిక్స్ అయ్యాక ఊహించని విధంగా ఆయనతో కూడా కట్ చేసుకుంది. అంతటితో ఆగక ఆ వెంటనే తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం స్టార్ చేసి.. గత కొంతకాలంగా విఘ్నేష్‌తో పబ్లిక్‌గా తిరుగుతోంది. అయితే ఈ ప్రేమ బాగా ముదరడంతో ఇక పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిందట నయనతార- విఘ్నేష్ శివన్ జోడీ. ఈ నేపథ్యంలో వీరి పెళ్ళికి ఇరు కుటుంబాల అంగీకారం కూడా లభించిందట. ఈ క్రమంలోనే వీరి వివాహం త్వరలోనే తమిళనాడులో జరగనుందని వార్తలు వినిపించాయి కానీ, లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం కేరళలోని ఓ అమ్మవారి గుడిలో నయన్ పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది. అతిత్వరలో ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించనున్నారని నయన్ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fYWNMM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...