అడల్ట్ మూవీస్‌తో సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసిన అలనాటి శృంగార తార అనారోగ్య కారణంగా ఆసుపత్రికి వెళ్లారు. అయితే హాస్పటల్ నుంచే ఆమె అభిమానులకు రిక్వెస్ట్ చేస్తూ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. కరోనా నేపథ్యంలో ముఖానికి మాస్క్ కట్టుకుని ఆవేశ పడుతూ షకీలా ఈ వీడియోను విడుదల చేయడంతో ఆమెకు ఏమైందంటూ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వల్ల హాస్పటల్‌కి వెళ్లిన షకీలా అక్కడ నుంచే తన ‘’ (Ladies Not Allowed) సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. షకీలా నటిస్తూ నిర్మించిన అడల్ట్ కామెడీ చిత్రం Ladies Not Allowed (లేడీస్ నాట్ అలౌడ్) ఈరోజు రాత్రి 8 గంటలకు ఆన్ లైన్‌లో విడుదల కానుండటంతో ఈ వీడియోను షేర్ చేశారు షకీలా. ఈరోజు జూలై 20.. రాత్రి 8 గంటలకు ‘లేడీస్ నాట్ అలౌడ్’ సినిమా రిలీజ్ అవుతుంది. ఈరోజు ఉదయం నుంచి ప్రమోషన్స్ చేయాలని అనుకున్నా.. కాని హెల్త్ ఇష్యూస్ రావడంతో హాస్పటల్‌కి రావాల్సి వచ్చింది. మీరు తప్పకుండా ఈ సినిమాను చూస్తారని ఆశిస్తున్నాను’ అంటూ వీడియో వదిలింది షకీలా. ఈ చిత్రానికి సాయి రామ్ దాసరి దర్శకత్వం వహించగా.. కావలి రమేష్ , విక్రాంత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ సినిమా రెండేళ్ల క్రితమే పూర్తైనా సెన్సార్ వాళ్లు సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో ఆవేదన చెందింది షకీలా. తన సేవింగ్స్ మొత్తం ఈ సినిమాపై పెడితే సెన్సార్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. చివరికి సినిమా విడుదలౌతుందన్న నమ్మకంతో అప్పులు కూడా చేశానన్నారు షకీలా. అయితే Ladies Not Allowed సినిమా విడుదలకు మరింత ఆలస్యం అవ్వడంతో అప్పుల వాళ్లు వేధిస్తున్నారని వాపోయింది షకీలా. ఒకవైపు లాక్ డౌన్ రావడంతో చాలా ఒత్తిడిలో ఉన్నానని.. ఈ సినిమా విడుదలకు డిజిటలైజ్ ఒక్కటే మార్గం అని ఆన్ లైన్‌లో విడుదల చేస్తున్నానని.. WWW.LadiesNotAllowed.Comలో ఈ సినిమాను విడుదల చేస్తున్నామని.. రూ.50 చెల్లించి అందరూ చూస్తే.. ప్రస్తుతానికి బతికిపోతా.. నేను తరువాత సినిమా చేయాలా వద్దా అనేది ఈ సినిమా డిసైడ్ చేస్తుంది’ అంటూ ఎమోషనల్ వీడియో విడుదల చేసింది షకీలా.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2DT1xFF
v
No comments:
Post a Comment