జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద దర్శకుడు రూపొందించిన సెటైరికల్ మూవీ ‘పవర్ స్టార్’పై జనసేనాని అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోని కొంత మంది సెలబ్రిటీలు కూడా వర్మ వైఖరిని తప్పుబడుతున్నారు. దీనికి తోడు రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా ఆయనపై ‘పరాన్నజీవి’ అనే సినిమాను పవన్ అభిమానులుగా చెప్పుకుంటోన్న కొంతమంది రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు కొంత మంది పవన్ కళ్యాణ్ అభిమానులు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. ‘‘శిఖరంని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు. మీకు అర్థం అయ్యిందిగా..’’ అని నిఖిల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇది రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించి చేసిన ట్వీటేనని అందరికీ అర్థమైంది. పవన్‌ను శిఖరంతో పోల్చిన నిఖిల్.. వర్మకు కుక్కతో పోల్చడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకున్నారు. అందుకే, ఎప్పుడూ లేని విధంగా నిఖిల్ ట్వీట్‌ను 13 వేల మంది రీట్వీట్ చేశారు. అయితే, నిఖిల్ చేసిన వ్యాఖ్యలపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఓ తెలుగు న్యూస్ ఛానెల్ లైవ్ ఇంటర్వ్యూలో వర్మ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో నిఖిల్ వ్యాఖ్యల గురించి యాంకర్ ప్రస్తావించారు. వెంటనే స్పందించిన వర్మ నిఖిల్ ఎవరో తనకు తెలీదన్నారు. ‘‘నిఖిల్ కావచ్చు, కిఖిల్ కావచ్చు.. వాళ్లంతా ఒకే కోవకు చెందినవాళ్లు. వీళ్లంతా పవన్ కళ్యాణ్ కింద తొత్తులు. ఇలా తొత్తుల్లా ఉంటే పవన్ కళ్యాణ్‌కు వీళ్లమీద మంచి అభిప్రాయం వస్తుందని వీళ్ల ఆశ. బానిసత్వం అనే బుద్ధిలో నుంచి వచ్చే ఆలోచన ఇది. నిఖిల్ ఎవడో నాకు తెలీదు. ఒక పెద్ద స్టార్ అయ్యుండొచ్చు.. కానీ నాకు తెలీదు’’ అని వర్మ వ్యాఖ్యానించారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eS3Ghy
v
No comments:
Post a Comment