Tuesday, 21 July 2020

అప్పుడు చాలా బాధేసింది.. ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్‌లో ఉన్నా: అనుపమా పరమేశ్వరన్

హీరోయిన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. మరో కేరళ కుట్టి కళ్యాణి ప్రియదర్శన్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన అనుపమ.. కేరళలోని తిరుచూరులో ఉన్న తన ఇంటి ఆవరణలో ఒక మొక్కను నాటారు. అయితే, మూడు మొక్కలు బదులు ఒక మొక్క నాటడం వెనుక కారణాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనుపమ వెల్లడించారు. తన ఇంటి నుంచి బయటికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఒక్క మొక్కే నాటగలిగానని ఆమె చెప్పారు. అంతేకాదు, ఆ మొక్కకు కళ్యాణి అని పేరు పెట్టారు. ‘‘ఛాలెంజ్‌ను ఇచ్చినందకు కళ్యాణి ప్రియదర్శన్‌కు కృతజ్ఞతలు. ఈమె నా కొత్త ఫ్రెండ్ ‘కళ్యాణి’ (మొక్క). ఈమె బ్రెజిలియన్ మల్‌బెరీ. కొన్ని రోజుల క్రితం దగ్గరలో ఉన్న మా స్థలంలో మేం సుమారు 25 మొక్కలు నాటాం. వాటిలో రెండు ఎండిపోయాయి. నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వచ్చింది. ఈ ఛాలెంజ్‌కు నన్ను నామినేట్ చేసినప్పుడు చాలా సంతోషపడ్డాను. కానీ, ప్రస్తుతం మాకు ఉన్న ఆంక్షల వల్ల (మేం కంటైన్మెంట్ జోన్‌లో ఉన్నాం) మా ఇంటి వద్ద ఉన్న కొద్ది స్థలంలో కేవలం ఒక్క మొక్కను మాత్రమే నాటగలిగాను. త్వరలోనే మిగిలిన మొక్కలను నాటతానని ప్రామిస్ చేస్తున్నాను’’ అని అనుపమా తన ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నారు. Also Read: కాగా, ఈ ఛాలంజ్‌ను తన అభిమానులంతా స్వీకరించి మొక్కలు నాటాలని అనుపమ కోరారు. అంతేకాదు, మరో 15 మందిని నేరుగా ఈ ఛాలెంజ్‌కు అనుపమ నామినేట్ చేశారు. వీరిలో నటి నివేదా థామస్, మలయాళ నటుడు కాళిదాస్ జయరామ్, శోభిత దూళిపాల, ఆహాన కృష్ణ, రాజీష్ విజయన్, ఐశ్వర్య లక్ష్మి, పద్మ సూర్య, పియర్లే మానే, గౌరీ జి కిషన్, సిజు విల్సన్, అను సితార, కృష్ణ శంకర్, పవిత్ర లక్ష్మి, లక్ష్మీ ప్రియ ఉన్నారు. వీరంతా తన ఛాలెంజ్‌ను స్వీకరించి ఒక్కొక్కరు మూడు మొక్కల చొప్పున నాటాలని అనుపమ పిలుపునిచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hnTyPv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...