Wednesday 29 July 2020

మెగాస్టార్‌ కాంప్లిమెంట్‌తో ఆస్కార్‌ వచ్చినంత సంబరపడ్డా: దర్శకుడు శ్రీధర్ సీపాన

‘లౌక్యం’ తెలిసిన రచయిత శ్రీధర్‌ సీపాన. ఏకకాలంలో ఐదారు చిత్రాలకు పని చేయగల సమర్ధుడు. ఆయన మాటల ‘పూలరంగడు’. వినోదంతో పాటు విలువైన విషయాలను చక్కగా చెప్పగలడు. కమర్షియల్‌ కథలకు కత్తిలాంటి మాటలు రాసి, కామెడీతో ప్రేక్షకులను మెప్పించగల రైటర్‌. ‘లౌక్యం’, ‘పూలరంగడు’, ‘ఆహనా పెళ్ళంట’ తదితర విజయవంతమైన చిత్రాలకు ఆయన రచయితగా పని చేశారు. జూలై 29న శ్రీధర్‌ సీపాన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ... బర్త్‌డేను ఎలా సెలబ్రేట్‌ చేసుకున్నారు? స్పెషల్‌ సెలబ్రేషన్స్‌ ఏమీ లేవు. ఫ్యామిలీ మెంబర్స్‌ మధ్య ఇంట్లో సెలబ్రేట్‌ చేసుకున్నా. ప్రజెంట్‌ కరోనా వల్ల అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళడం లేదు. ఇల్లు, ఆఫీసు, పని అంతే! రైటర్‌గా ఈ ఇయర్‌ ఎలా ఉంది? నేను అయితే ఎప్పటికీ మరువలేను. మెగాస్టార్‌ గారు, చక్కటి సందేశాత్మక కథలకు కమర్షియల్‌ విలువలు మేళవించి సినిమాలు రూపొందించే దర్శకుడు కొరటాల శివ గారి కాంబినేషన్‌లో ఫస్ట్‌టైమ్‌ వస్తున్న ‘ఆచార్య’ సినిమా స్ర్కిప్ట్‌ వర్క్‌లో పాలు పంచుకున్నా. వాళ్ళిద్దరితో మంచి రిలేషన్‌ ఏర్పడింది. అలాగే, దర్శకుడిగా నా మొదటి సినిమా స్ర్కిప్ట్‌ వర్క్‌ కంప్లీట్‌ చేశా. చిరంజీవి గారి అల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా జీఏ2 పిక్చర్స్‌ సమర్పణలో పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్‌ గారు, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ అభిషేక్‌ గారు నిర్మిస్తారు. Also Read: దర్శకులుగా మారుతున్న రచయితల జాబితాలో మీరు చేరుతున్నారన్నమాట! తన ఊహలకు అనుగుణంగా తన కథను తెరపై ఆవిష్కరించుకున్నప్పుడు రచయితలకు కిక్‌ వస్తుంది. సంతృప్తి దొరుకుతుంది. ఆ కిక్‌ కోసమే రచయితలందరూ దర్శకులు అవుతారు. నేనూ అలాగే ఆలోచించి మెగాఫోన్‌ పట్టాను. దర్శకుడు అవుతున్నారు. రచన పరంగా ఇతర దర్శకుల సినిమాలకు దూరంగా ఉంటారా? అటువంటిది ఏమీ లేదు. రచన, దర్శకత్వం.. రెండూ నాకు రెండు కళ్ళు వంటివి. ఓ కన్ను కోసం మరో కన్నును వదులుకోలేను. రచయితగా ఒక్కోసారి ఐదారు చిత్రాలకు పని చేసిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల, దర్శకత్వంతో పాటు అవకాశాలు వస్తే రచయితగా కూడా కొనసాగుతా. రైటింగ్‌కి దూరం కాను. కేవలం నా సినిమాలు మాత్రమే కాకుండా ఇతరుల సినిమాలకు కూడా రాస్తా. దర్శకుడినైనా రచయితగా నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. కళ్యాణ్‌ దేవ్‌తో మీ సినిమా ఎలా ఉండబోతుంది? కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ అది. ప్రేక్షకులను పూర్తిగా నవ్విస్తుంది. అలాగే, మధ్య మధ్యలో మంచి ఎమోషనల్‌ సీన్స్‌ కూడా ఉంటాయి. చిరంజీవి గారికి ఆ సినిమా కథ చెప్పారా? ‘ఆచార్య’ స్ర్కిప్ట్‌ వర్క్‌లో పాలు పంచుకున్నానని చెప్పాను కదా! అలా చిరంజీవి గారితో పరిచయం ఏర్పడింది. ఆయన దగ్గరకు కథ చెప్పడానికి కళ్యాణ్‌ దేవ్‌ నన్ను తీసుకువెళ్ళారు. కథంతా విన్నాక ‘సుదీర్ఘంగా కథ వింటున్నప్పుడు మధ్యలో రెప్పలు పడతాయి. నువ్వు కథ చెబుతుంటే రెప్ప వేయకుండా విన్నాను. ఆద్యంతం నవ్వుతూ విన్నాను’ అని చిరంజీవి గారు చెప్పారు. ఆ మాట ఆస్కార్‌ అవార్డు వచ్చినంత సంతృప్తినిచ్చింది. అలాగే, రాఘవేంద్రరావు గారు, కొరటాల శివ గారు విని బావుందని మెచ్చుకున్నారు. ప్రోత్సహించారు. Also Read: రచయితగా, దర్శకుడిగా మీ లక్ష్యం ఏంటి? ప్రతి సినిమాతో ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని అందించడమే నా లక్ష్యం. హెల్దీ కామెడీ అందిస్తా. మీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌? కళ్యాణ్‌ దేవ్‌ సినిమా చేస్తున్నా. అలాగే, రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించనున్న ఓ సినిమాకి సంభాషణలు రాస్తున్నా. అనిల్‌ సుంకర నిర్మాణంలో మరో సినిమా చేయాలి. శ్రీనివాస్‌ వంగాల నిర్మాణంలో నేను దర్శకత్వం వహించిన ‘బృందావనమది అందరిదీ’ షూటింగ్‌ కంప్లీట్‌ చేశా. కళ్యాణ్‌ దేవ్‌ సినిమా తర్వాత ఓటీటీలో ఆ సినిమా రిలీజవుతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/310RrdV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...