Monday, 20 July 2020

Archana: బిగ్ బాస్‌లో మనం పీకేదేమీ ఉండదు.. అలా చేసిన వాళ్ళే చివరకు! అర్చన షాకింగ్ కామెంట్స్

బుల్లితెర పాపులారిటీ షో సీజన్ 1లో పాల్గొన్న బ్యూటిఫుల్ తాజా ఇంటర్వ్యూలో ఆ సంగతులను పంచుకుంది. బిగ్ బాస్‌లో మనం పీకేదేమీ ఉండదంటూ, ఆ విషయం తెలియక పార్టిసిపెంట్స్ ఏదేదో ఉహించుకుంటారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కాకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక తాను ఒక్క విషయం మాత్రం పక్కాగా నేర్చుకున్నానని ఆమె తెలిపింది. అర్చన మాట్లాడుతూ.. ''బిగ్ బాస్ హౌస్‌లో విభిన్న స్వభావాలున్న వ్యక్తులను కంటిస్టెంట్లుగా తీసుకున్నారు. అయితే వారంతా ఒకరిపై ఒకరు దురుసుగా కామెంట్స్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళను తొక్కేయాలని, హౌస్ నుంచి బయటకు పంపించేయాలని చూస్తుంటారు. కానీ వారికి తెలియని విషయం ఒక్కటే. ఎవరైతే పక్కోడిని తక్కువ చేస్తూ మాట్లాడతారో వాళ్ళే చులకన అవుతారు. మనం పీకేదేమీ లేదక్కడ.. ఆడియన్స్ ఓటేస్తే గెలుస్తాం. ఈ సింపుల్ లాజిక్ అర్థం చేసుకోవడంలో కొందరు విఫలమవుతుంటారు. ఇవన్నీ హౌస్‌లో నేను ప్రత్యక్షంగా చూశాను'' అని చెప్పింది. Also Read: కాగా అదే బిగ్ బాస్ హౌస్‌లో కొందరు లవ్లీ పీపుల్‌ని కూడా కలిశానని అర్చన పేర్కొంది. అయితే బిగ్ బాస్ హౌస్‌కి వెళ్ళాక.. మనం ఎవ్వరినీ హర్ట్ చేయకుండా, మనల్ని హర్ట్ చేసిన వాళ్ళను మాత్రం అస్సలు వదలొద్దనేది పక్కాగా నేర్చుకున్నానని చెప్పింది అర్చన. సినిమా అవకాశాలు తగ్గుతున్న తరుణంలోనే బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇటీవలే ప్రముఖ హెల్త్ కేర్ కంపెనీ అధ్యక్షుడిగా ఉన్న జగదీష్ భక్తవచ్చలమ్ అనే వ్యక్తి పెళ్లి చేసుకొని ఓ ఇంటిదానిగా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eLnnYH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...