Monday, 20 July 2020

Anasuya Bharadwaj: నీకు బుర్ర దొబ్బి ఇలా చేస్తున్నావ్.. అవును నాకు పొగరు! లైవ్‌లో అనసూయ జబర్దస్తీ..

ముక్కుసూటిగా మాట్లాడే యాంకర్లలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది జబర్దస్త్ బ్యూటీ అనసూయ. జబర్దస్త్ ప్రోగ్రాంలో తనపై పంచులేస్తుంటే పంచదారలా చప్పరించే ఈ ముద్దుగుమ్మ నెటిజన్స్ ట్రోల్ చేస్తే మాత్రం అస్సలు సహించదు. వెంటనే ఆ నెటిజన్ దుమ్ముదులిపేయడం నైజం. తాజాగా జరిగిన ఓ ఆన్ లైన్ చాట్‌లో ఇలాంటి సందర్భమే ఎదురుకావడంతో తనను కామెంట్ చేసిన నెటిజన్‌ని లైవ్‌లోనే కడిగిపారేస్తూ జబర్దస్తీ చేసింది అనసూయ. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లతో టచ్ లోకి వచ్చే అనసూయ చాలా సందర్భాల్లో నెగెటివ్ కామెంట్స్ ఎదుర్కొంది. ఎంతోమంది ఆకతాయి నెటిజన్స్ ఆమెపై అసభ్యకర కామెంట్స్ చేసే ప్రయత్నం చేశారు. అయితే అలా జరిగిన ప్రతిసారి రెచ్చిపోయి దిమ్మతిరిగే సమాధానాలిస్తూ వస్తున్న ఈ బ్యూటీ.. రీసెంట్ చాట్‌లో, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి తాము పడుతున్న కష్టాలను వివరిస్తూ ఓ నెటిజన్ దుమ్ముదులిపింది. నీకసలు బుర్రే లేదంటూ రెచ్చిపోయింది ఈ జబర్దస్త్ భామ. Also Read: తాజాగా అనసూయ పాల్గొన్న లైవ్ చాట్‌లో 'జబర్దస్త్‌లో ట్రోల్ కాకుండా ఇంకేం చేస్తారు మేడం.. అవేమన్నా భక్తి పాటలా?' అంటూ ఓ నెటిజన్ ప్రశ్న వేశాడు. దీంతో చిర్రెత్తే కోపంతో ఊగిపోయిన అనసూయ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చింది. ''బాబూ.. మీకు ఈ రోజు జ్ఞానోదయం చేయాలి. జబర్దస్త్‌లో ఏం చేసినా.. ఉదాహరణకు కలర్ గురించి, బట్ట గురించి, పొట్ట గురించి ఇలా దేనిపై కామెంట్ చేసినా అది ఎవ్వరినీ ఉద్దేశించి కాదు. అందుకే ముందుగానే డిస్ప్లే చేస్తారు ఇందులో చూపించే సన్నివేశాలు ఎవ్వరినీ ఉద్దేశించి చేసినవి కావని. ఒకవేళ ఆర్టిస్టులెవరైనా నా మీద పంచులేయాలన్నా ముందుగా నా పర్మిషన్ తీసుకునే వేస్తారు. ఏవో కొన్ని సందర్భాల్లో అనుకోకుండా పంచ్ వేస్తారు అంతే. వాళ్ళు రియల్ జెంటిల్‌మెన్స్. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడం కోసం మేము ఎంత రిస్క్ తీసుకుంటున్నామో మీకు తెలియదు. మాకు ఆ వర్క్, వినోదం పంచడం తప్ప ఏమీ తెలియదు. మీ వినోదం కోసం మా లైఫ్ రిస్క్‌లో పెట్టుకుంటున్నామని మీరు అర్థం చేసుకోవాలి. రొటీన్ సినిమాలు, రొటీన్ సీరియల్స్ చూసి చూసి బోర్ కొట్టకుండా మేము వినోదం పంచుతున్నాం. ఇలాంటి సందర్భంలో ప్రతీదీ నన్నే అంటున్నారనుకుంటే తప్పు కదా. అక్కడ ట్రోల్స్ చేయరు.. కామెడీ చేస్తారు. కానీ ఇక్కడ పర్టికులర్‌గా అనసూయను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఆ బుర్ర నీకు ఉండి ఉంటే ఇలా అనేవాడివి కాదు. అవును నాకు పొగరు. నా పట్ల మీ వైఖరిని బట్టే నా వైఖరి మారుతూ ఉంటుంది'' అంటూ జబర్దస్తీ చేస్తూ కౌంటర్ల మీద కౌంటర్లు వేసింది అనసూయ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2E4bssd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...