Thursday, 23 July 2020

Allu Arjun: కొరటాలతో రెడీ అనేసిన అల్లు అర్జున్! క్రేజీ కథతో స్పెషల్ ట్రీట్..

'అల.. వైకుంఠపురములో' సినిమాతో ఈ ఏడాది ఆరంభంలోనే భారీ హిట్ సాధించిన అల్లు అర్జున్.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. , రష్మిక మందన హీరోహీరోయిన్లుగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడటంతో ఈ గ్యాప్‌లో తదుపరి సినిమా గురించిన ఆలోచనలు చేస్తున్నారట అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో కొరటాల శివతో చర్చలు జరిపిన బన్నీ.. ఆయనతో సినిమా చేసేందుకు రెడీ అయ్యారని సమాచారం. ఇటీవలే ఈ ఇద్దరి మధ్య కథా చర్చలు నడిచాయని, ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో పడ్డారట . గత కొన్ని రోజులుగా ఈ పనిలో ఉన్న కొరటాల.. ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేసి బన్నీ ముందుంచడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. మెసేజ్ ఒరియెంటేడ్‌ మూవీలు రూపొందించే కొరటాల.. క్రేజీ కథతో బన్నీని కెమెరా ముందుకు తీసుకురానున్నారట. అతి త్వరలో దీనిపై అఫీషియల్ ప్రకటన రానుందని టాక్. ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' మూవీ చేస్తున్నారు కొరటాల శివ. చిత్రంలో చిరు సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. కొంతభాగం షూటింగ్ ఫినిష్ చేసుకొని కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ కూడా వాయిదా పడింది. అయితే చిరంజీవితో ఆచార్య షూటింగ్ ఫినిష్ అయ్యాకే అల్లు అర్జున్ సినిమాను లైన్ లోకి తీసుకొచ్చేలా కొరటాల ప్లాన్ రెడీ చేసుకున్నారని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fSkC9j
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...