Wednesday 29 July 2020

వైసీపీకి 130 సీట్లు, జనసేన ఓటమి, లోకేష్ గెలవడట: బండ్ల వారి లెక్కలు

నీ బండ బడా.. ఈ ఉన్నాడే.. రాజకీయాల్లో ఇప్పుడు లేడు కాని.. ఉన్నన్నాళ్లూ సినీ, రాజకీయ వర్గాల్లో కామెడీకి కొదువలేకుండా చేశారు. నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ గత ఎన్నికల్లో పొలిటీషియన్ అవతారం ఎత్తాడు. ఎన్నికలు రాకముందే ‘బండ్ల గణేష్ అనే నేను’ అంటూ టీవీ ఇంటర్వ్యూలలో ప్రమాణస్వీకారం కూడా చేసేశారు. అంతేకాదు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే.. 7 Clock బ్లేడ్‌తో పీక కోసుకుంటా అని ఎన్నికల తరువాత రిపోర్టర్లు బ్లేడ్ పట్టుకుని తిరిగేలా చేశారు బండ్ల. ఆ తరువాత బుద్ది వచ్చింది బాబోయ్.. ఇక జన్మలో రాజకీయాలు జోలికి పోను.. ఇక సినిమాలే చేసుకుంటా అంటూ లెంపలు వేసుకున్నారు. ఇటీవల కరోనాను జయించిన బండ్ల గణేష్.. పాలిటిక్స్‌లో లేను అంటూ ఏపీ పాలిటిక్స్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన దేవుడు జనసేన అధినేత గురించి మాట్లాడుతూ.. పవన్ సినిమాలపై మాట్లాడగలను కాని.. ఆయన రాజకీయ ప్రస్థానం ఆయన ఇష్టం. జనసేన పార్టీకి ఒక్క సీటే రావడం.. పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోవడం బాధగానే అనిపించింది. ఆయన గెలిస్తే బాగుండేదని అనుకున్నా.. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పెట్టినప్పటికీ కూడా.. ఆ పార్టీ ఓడిపోతుందని నాకు ముందే తెలుసు. Also Read: అక్కడ వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుందని.. 130 సీట్లు పక్కాగా వస్తాయని నాకు ముందే తెలుసు. ఢిల్లీలో నాకు లగడపాటి మధు అని ఫ్రెండ్ ఉన్నారు.. ఆయనకు ఎన్నికల ఫలితాలపై బాగా అవగాహన ఉండేది.. ఆయనే చెప్పారు.. జగన్ 130 సీట్లకు పైగా గెలుస్తున్నాడు అని. అన్ని సీట్లు ఎందుకు వస్తాయి సార్ అనేవాడిని కాని.. లోకేష్ కూడా ఓడిపోతున్నాడని ఆయన ముందే చెప్పారు. అదేంటి సార్.. అంటే!! చూడు ఏం జరుగుతుందో అన్నారు. ఆయన అన్నట్టుగానే లోకేష్ ఓడిపోయాడు. Also Read: అలా లోకేష్ ఓడిపోతున్న విషయం నాకు ముందుగానే తెలుసు. లోకేష్ సీఎం అవుతాడో లేదో నాకు తెలియదు.. నాకు అవకాశం వస్తే నేనే అవుతా.. లేదంటే నా కొడుకుని చేస్తా కాని.. లోకేష్ సీఎం అవుతాడో లేదో నేను చెప్పలేను. ప్రస్తుతం నేను ఏ పార్టీలోనూ లేను.. పాలిటిక్స్ నాకు సంబంధం లేని విషయం’ అంటూ చెప్పుకొచ్చారు బండ్ల గణేష్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2P7LSF4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...