Monday 29 June 2020

‘మా గంగానది’ ట్రైలర్: ఆలీ కూతురు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ

ఆలీ, నియా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘మా గంగానది’. ‘అంత ప్రవిత్రమైనది స్త్రీ’ అనేది ఉప‌శీర్షిక‌. ర‌వికుమార్ స‌మ‌ర్పణ‌లో మూకాంబికా ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై వి.నాగేశ్వర‌రావు, సూర్యవంత‌రం, ఎం.ఎన్‌.యు.సుధాక‌ర్ నిర్మించారు. వి. బాలనాగేశ్వర‌రావు ద‌ర్శక‌త్వం వహించారు. ఈ చిత్రంలో కుమార్తె బేబీ జువేరియా న‌టించ‌డం విశేషం. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఆలీ తాజాగా విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా ఆలీ మాట్లాడుతూ.. ‘‘సాధార‌ణంగా మ‌నం న‌టించిన సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్‌ను మ‌రొక‌రితో విడుద‌ల చేయిస్తుంటాం. కానీ క‌రోనా వ‌ల్ల అంద‌రూ భౌతిక దూరం పాటించాల్సి వ‌స్తుంది. అందుక‌ని నా సినిమా ట్రైల‌ర్‌ను నేనే గెస్ట్‌గా మారి విడుద‌ల చేస్తున్నాను. సినిమాలో తొలిసారి సీరియస్ పాత్ర చేశాను. ఇందులో నా కుమార్తె పాత్రలో నా కూతురు జువేరియా న‌టించింది. జువేరియాను స్క్రీన్‌పై చూడాల‌నేది వాళ్ల అమ్మ ఆశ. Also Read: చిన్నప్పుడు స్క్రీన్‌పై న‌న్ను చూసుకుని మా అమ్మ ఎలా సంతోష‌ప‌డిందో, నా భార్యకు కూడా మా అమ్మాయిని స్క్రీన్‌పై చూసి ఆనంద‌ప‌డాల‌ని ఎప్పటి నుంచో కోరిక‌. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. కేర‌ళ అమ్మాయి నియా హీరోయిన్‌గా న‌టించింది. ఇంకా చాలా మంది న‌టీన‌టులు నటించారు. హీరోగా ఇది నాకు 53వ సినిమా. లాక్‌డౌన్‌కి ముందే సినిమా రెడీ అయ్యింది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం అంద‌రికీ న‌చ్చుతుంద‌నే న‌మ్మకం ఉంది. ప్రేక్షక దేవుళ్ల ఆశీర్వాదం త‌ప్పక ఉంటుంద‌ని భావిస్తున్నాం’’ అని అన్నారు. డైరెక్టర్ వి. బాల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ముఖ్యంగా స్త్రీ సమస్యలపై రూపొందిన చిత్రమిది. ఈ చిత్రంలో ఆలీ గారి చిన్న కుమార్తె జువేరియా కూడా న‌టించ‌డం విశేషం. తప్పకుండా ఈ సినిమాను ఆశీర్వదించాల‌ని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. కాగా, ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చారు. ప్రవీణ్ వనమాలి సినిమాటోగ్రఫీ అందించారు. ఈవీవీ సత్యనారాయణ ఎడిటర్. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వి. బాల‌నాగేశ్వర‌రావు. ‘మా గంగానది’ ట్రైలర్


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2BTmGOU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...